Home » ఒకసారి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ ఈ దర్శకులకు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన హీరోలు వీరే..! 

ఒకసారి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ ఈ దర్శకులకు మళ్లీ ఛాన్స్ ఇచ్చిన హీరోలు వీరే..! 

by Anji
Ad

సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. దర్శకులు ఒకసారి ఫ్లాప్ ఇస్తే.. మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు అస్సలు ఒప్పుకోరు. కానీ కొంత మంది స్టార్ హీరోలు మాత్రం దర్శకులు ఒకసారి ఫ్లాప్ ఇచ్చినప్పటికీ మళ్లీ ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం. 

Advertisement

Also Read :  కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాని కాపీ కొట్టబోయి ఫ్లాప్ అయిన చిరంజీవి సినిమా ఏదో తెలుసా ?

ఎన్టీఆర్-మెహర్ రమేష్

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో కంత్రి సినిమా తెరకెక్కిన విషయం విధితమే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ఫలితాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇదే కాంబోలో శక్తి పేరుతో మరో మూవీ తెరకెక్కగా శక్తి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్స్ ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ దర్శకుడు మెహర్ రమేష్ కి రెండు సార్లు ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనే చెప్పాలి. 

ఎన్టీఆర్-పూరిజగన్నాథ్ 

NTR Purijannath

ఎన్టీఆర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆంధ్రావాలా ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. కానీ ఎన్టీఆర్-పూరి కాంబోలో టెంపర్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 

రవితేజ-హరీష్ శంకర్ 

Advertisement

Manam News

రవితేజ-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి షాక్ చిత్రం అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం తరువాత రవితేజ మళ్లీ దర్శకుడు హరీష్ శంకర్ కి మిరపకాయ్ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.  

Also Read :  ‘ఆంధ్రుడు’ సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా..?

గోపిచంద్-సంపత్ నంది 

Manam News

గోపిచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో గౌతమ్ నంద చిత్రం తెరకెక్కగా ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఆ తరువాత వీరి కాంబినేషన్ లో వచ్చినటువంటి  సీటిమార్ చిత్రం మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.  

Also Read :  హీరో రాజశేఖర్ కూతురుతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?

మహేష్ బాబు- త్రివిక్రమ్ 

Manam News

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా చిత్రం మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఖలేజా ఫ్లాప్ తరువాత మహేష్ త్రివిక్రమ్ కి మరో ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా మహేష్ కి హిట్  ఇస్తుందో లేక ఫ్లాప్ ఇస్తుందో చూడాలి.  

Also Read :  బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Visitors Are Also Reading