Home » హీరో రాజశేఖర్ కూతురుతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?

హీరో రాజశేఖర్ కూతురుతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?

by Anji
Ad

బిగ్ బాస్ షో సీజన్ 3 కి విన్నర్ గా నిలవడంతో  తెలుగు రాష్ట్రాలలో రాహుల్ సిప్లిగంజ్ పేరు మారు మ్రోగిపోయింది. తన టాలెంట్ తో రాహుల్ సిప్లిగంజ్ అంతకంతకు ఎదుగుతున్నారు. ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రేక్షకుల నుంచి ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం విశేషం. ఓవైపు సింగర్ గా కొనసాగుతూనే.. మరోవైపు నటుడిగా సక్సెస్ పుల్ గా తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. హీరో రాజశేఖర్ కూతురు శివాత్మికతో రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి వాస్తవంగా జరిగింది కాదండోయ్.. సినిమాలో జరిగిన పెళ్లి కావడం గమనార్హం. 

Advertisement

రంగమార్తాండ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటిస్తున్నారు. గత కొంత కాలం నుంచి ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ విడుదల అయింది. అందులో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కృష్ణవంశీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రంగమార్తాండ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం గమనార్హం.

Advertisement

Also Read :  మరో 3 వారాలు కీలకం..ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..!!

ఈ సినిమాతో పూర్వవైభవం వస్తుందని కృష్ణవంశీ భావిస్తుండగా.. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. నిన్నే పెళ్లాడుతా సినిమా తరహాలో ఈ పోస్టర్ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మికలకు ఈ చిత్రంతో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాల్సి ఉంది. రీమెక్ చిత్రంగా తెరకెక్కిన రంగమార్తాండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రం అంచనాలను మించి మెప్పిస్తుందో లేదో అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రంతో తన రేంజ్ ని అందుకుంటాడో లేదో వేచి చూడాలి మరి. 

Also Read :   తారకరత్న చికిత్స కోసం ఆసుపత్రి బిల్లు ఎవరు చెల్లిస్తున్నారో తెలుసా ?

Visitors Are Also Reading