Home » ఫస్ట్ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సినీ ప్రముఖులు వీరే..!

ఫస్ట్ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సినీ ప్రముఖులు వీరే..!

by Anji
Ad

సాధారణంగా ఎవరికైనా తొలి సినిమా అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఫస్ట్ మూవీ కోసం ప్రతీ కళాకారుడు చాలా కష్టాలు పడుతుంటాడు. తెరపై కనిపించేందుకు ఏళ్ల తరబడి గేట్ వద్ద కాపాలా కాసిన వారు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోల నుంచి కమెడీయన్స్ వరకు తొలి సినిమా ఛాన్స్ మాత్రం అంత ఈజీగా రాలేదనే చెప్పాలి. వచ్చాక కొందరూ తమ టాలెంట్ నిరూపించుకుంటే.. మరికొందరూ మధ్యలోనే పులిస్టాప్ పెట్టిన వారు చాలా మందే ఉన్నారు. కొంత మందికి తమ తొలిసినిమా వాళ్లకు మరిచిపోలేని అనుభూతి. ముఖ్యంగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అనే చెప్పవచ్చు. అదే వారి ఇంటిపేరుగా మారిపోతే వారికి అంతకంటే ఎక్కువ ఆనందం ఏముంటుంది. 

Advertisement

చాలా మంది సినిమా ఇండస్ట్రీలో తమ తొలి సినిమాతోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. దీంతో వారు ఏళ్ల కొద్ది అదే వాళ్ల ఇంటి పేరుగా కూడా మారిపోయింది. అలాంటి వారిలో దిల్ రాజు, అల్లరి నరేష్ వంటి స్టార్స్ కూడా ఉన్నారు. ఎంతో మంది దర్శకులు, కమెడీయన్స్ కూడా తమ తొలి మూవీనే ఇంటిపేరుగా మార్చేసుకున్నారు. అలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వారు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

సిరివెన్నెల సీతారామశాస్త్రీ :

సిరివెన్నెల సినిమాతో సినీ రంగం ప్రవేశం చేశారు సీతారామశాస్త్రీ. ఈ మూవీకి అద్భుతమైన పాటలు అందించారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పేరే తన ఇంటిపేరుగా మారిపోయింది. 

బొమ్మరిల్లు భాస్కర్ :

Advertisement

2006లో బొమ్మరిల్లు సినిమాకి దర్శకత్వం వహించాడు భాస్కర్. ఇక అప్పటి నుంచి ఆయన పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. 

దిల్ రాజు :

దిల్  సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన రాజు పేరు కూడా దిల్ రాజు గా మారిపోయింది. దిల్ రాజు అసలు వెంకట్ రమణారెడ్డి. 

శుభలేఖ సుధాకర్ :

శుభలేఖ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన సుధాకర్ కి శుభలేఖ సుధాకర్ అనే పేరు వచ్చింది. శుభలేఖ అనేది ఇంటిపేరుగా మారిపోయింది. 

వెన్నెల కిషోర్ :

వెన్నెల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిషోర్ కి కూడా వెన్నెల కిషోర్ అని మారిపోయింది. 

అల్లరి నరేష్ :

అల్లరి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నరేష్ కి అల్లరి నరేష్ అనే పేరు వచ్చింది. అల్లరి సినిమాకి రవిబాబు దర్శకత్వం వహించారు. 

సత్యం రాజేష్ :

సత్యం మూవీతో ఎంట్రీ ఇచ్చిన రాజేష్ పేరు కూడా సత్యం రాజేష్ గా మారిపోయింది. ఇలా చాలా మంది నటుల తొలిసినిమా పేర్లు ఇంటి పేరుగా మారిపోయాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 అమ్మకు మళ్లీ పెళ్లి చేసిన సాయి ధరమ్ తేజ్…!

ఎన్టీఆర్ కుటుంబంతో వడ్డే నవీన్ కి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?

మన టాలీవుడ్ సెలబ్రిటీల అసలు పేర్లు!

Visitors Are Also Reading