టీమిండియా క్రికెటర్ల వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి లిస్ట్ లో ఐదుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. వీరి భార్యలు వారి కన్నా ఏజ్ లో పెద్దవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
హార్దిక్ పాండ్యా :
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, తాత్కాలిక టీ-20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ ని రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. తొలుత వీరి పెళ్లి మే 31, 2020 పెళ్లి చేసుకున్నారు. నటాషా సెర్బియా మోడల్. ఇటీవల ఫిబ్రవరి 14, 2023 ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వెడ్డింగ్ జరిగింది.
విరాట్ కోహ్లీ :
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. 2013లో మొదలైన వీరిద్దరి ప్రేమాయణం.. చివరికీ డిసెంబర్ 17, 2017లో పెళ్లితో ముగిసింది. ఇక వీరి పెళ్లి ఇటలీలో జరిగింది. ఆ తరువాత ముంబైలో రిసెప్షన్ జరుపుకున్నారు. వీరిద్దరి పెళ్లి సమయంలోనే విరుష్క అనే పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగింది. అయితే విరాట్ కోహ్లీ కన్నా అనుష్క శర్మ ఆరు నెలలు పెద్దది.
సచిన్ టెండూల్కర్ :
Advertisement
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచవ్యాప్తంగా సచిన్ కి ఎంత క్రేజ్ ఉంటదో అందరికీ తెలిసిందే. టెండూల్కర్ కి మే 24, 1995న అంజలితో పెళ్లి జరిగింది. అయితే సచిన్ టెండూల్కర్ కంటే ఆయన భార్య అంజలి 6 సంవత్సరాల పాటు పెద్దది. పెళ్లి జరిగిన నాటికి సచిన్ వయస్సు కేవలం 22 ఏళ్లు మాత్రమే.
శిఖర్ ధావన్ :
అదేవిధంగా భారత జట్టు స్టార్ ఓపెనర్ శిఖర ధావన్ 2012లో అయేషా ముఖర్జీని పెళ్లి చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులను ఎదిరించి మరి దావను ఆయేషాను పెళ్లి చేసుకున్నాడు. అయితే శిఖర్ ధావన్ కంటే ఆయేషా దాదాపు 10 ఏళ్లు పెద్దది. వీరు 2021 సెప్టెంబర్ నెలలో విడిపోయారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
జస్ప్రీత్ బుమ్రా :
భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. బొమ్రా వ్యాఖ్యాత సంజన గణేష్ అన్న పెళ్లి చేసుకున్నారు. బొమ్రా కంటే సంజన రెండు సంవత్సరాల ఏడు నెలలు పెద్దది.
Also Read : ధనుష్ ‘సార్’ మూవీపై దర్శకుడు భారతీరాజా ఏమన్నారంటే..?