Telugu News » ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్‌లు వీరే..!

ఐపీఎల్లో టాప్ 5 రిచెస్ట్ టీమ్ ఓనర్‌లు వీరే..!

by Manohar Reddy Mano

మనం దేశంలో ప్రస్తుతం క్యాచ్ రిచ్ లీగ్ ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. కరోనా కారణంగా గత రెండు ఏళ్లుగా విదేశాలలో జరిగిన ఈ లీగ్ ఇప్పుడు ఇండియాలోనే జరుగుతుంది. అయితే ఈ ఏడాది లీగ్ లోకి మరో రెండు కొత్త జట్లు రావడంతో ఐపీఎల్ మజా మరింత పెరిగింది. ఇక ఈ క్యాచ్ రిచ్ లీగ్ లో ఉన్న జట్ల ఓనర్లలో బాగా డబ్బు ఉన్న 5 జట్ల ఓనర్ల గురించి తెలుసుకుందాం..!

Ads

రిలయన్స్ ఇండస్ట్రీస్ …

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భారతదేశంలోయా అత్యధిక ధనవంతుడైన బిలియనీర్… ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. దీని నెట్ వర్త్ 21.2 బిలియన్ల డాలర్లుగా లెక్కించబడుతుంది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ, వారు ఇప్పటికే 5 టైటిల్స్ అందుకుకోగా… ఐపీఎల్ 2022 లో వరుసగా 5 ఓటములు చవిచూశారు.

కళానిధి మారన్…

సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ యజమాని. వీరు 2 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో ఐపీఎల్ లో రెండవ అత్యంత సంపన్న ఓనర్ గా ఉన్నారు. SRH 2013లో వారి ఐపీఎల్ అరంగేట్రం చేసి 2016లో తొలి టైటిల్‌ను గెలుచుకుంది. గత సీజన్‌లో ఘోరంగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ.. ప్రస్తుతం ఐపీఎల్ 2022 లో వరుస విజయాలు నమోదుచేసింది.

షారుఖ్ ఖాన్…

బాలీవుడ్ క బాద్ షా.. షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ యూక ఓనర్. దీనికి జూహీ చావ్లా మరియు వ్యాపారవేత్త జే మెహతా సహ-యజమానులుగా ఉన్నారు. కింగ్ ఖాన్ నెట్ వర్త్ సుమారు 600 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గంభీర్ కెప్టెన్సీలో 2012 మరియు 2014లో నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఇక గత సీజన్‌లో ఫైనల్‌కు చేరుకొని CSK చేతిలో ఓడిపోయింది.

JSW గ్రూప్..

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును JSW గ్రూప్ మరియు GMR గ్రూప్‌ లు నడిపిస్తున్నాయి . JSW గ్రూప్ అనేది సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని భారతీయ బహుళజాతి సమ్మేళనం మరియు O.P. జిందాల్ గ్రూప్‌లో భాగం. తాజా లెక్కల ప్రకారం ఈ గ్రూప్ 270 మిలియన్ డాలర్ల నెట్ వర్త్ కలిగి ఉంది. JSW గ్రూప్ అనేది భారతదేశం, యూఎస్, దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా అంతటా ఉక్కు, శక్తి, ఖనిజాలు, నౌకాశ్రయాలు, మౌలిక సదుపాయాలు మరియు సిమెంట్ వంటి రంగాలలో పాలుపంచుకుంది. ఇక ఐపీఎల్ 2022 లో ఢిల్లీ జట్టు అనుకున్న విధంగా రాణించడం లేదు.

మనోజ్ బదాలే..

రాజస్థాన్ రాయల్స్‌లో మనోజ్ బదాలేకు 65% వాటా ఉంది. బాదలే భారతదేశంలో జన్మించిన వ్యాపారవేత్త మరియు వెంచర్ క్యాపిటలిస్ట్. అతను వెంచర్ క్యాపిటల్ సంస్థ బ్లెన్‌హీమ్ చాల్‌కాట్‌కు సహ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ భాగస్వామి. ఇక తాజా వివరాల ప్రకారం… బదలే నెట్ వర్త్ 160 మిలియన్ డాలర్లుగా ఉంది. 2008లో మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్… అప్పటి నుంచి ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ జట్టు అంచనాలకు మించి రాణిస్తుంది.


You may also like