Home » కొత్త కెప్టెన్ కోసం టాస్క్.. ప్రియాంకకు షాక్ ఇచ్చిన యావర్..!

కొత్త కెప్టెన్ కోసం టాస్క్.. ప్రియాంకకు షాక్ ఇచ్చిన యావర్..!

by Anji
Ad

బిగ్‌బాస్‌ హౌస్ లో ఈవారం నామినేషన్స్ రచ్చ ఏ రేంజ్ లో జరిగాయో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈ వారం హౌస్ లో మొత్తం బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు హౌస్మేట్స్. దీంతో ఆ తర్వాత ఫన్నీ టాస్కులు ఇచ్చి కాసేపు వినోదం పండించేందుకు ట్రై చేశాడు బిగ్‌బాస్‌. కానీ ఆ టాస్క్ అనుకున్నంతగా ఎంటర్టైన్ చేయలేకపోయారు. ఇక ఇప్పుడు హౌస్ లో కొత్త కెప్టెన్ కోసం కంటెస్టెంట్లకు టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌.

Advertisement

తాజాగా విడుదలైన ప్రోమోలో కొత్త కెప్టెన్ ఎవరనేది కంటెస్టెంట్స్ ఎంచుకోవాలంటూ ఫిటింగ్ పెట్టాడు. కొత్త కెప్టెన్ ఎవరు అవుతారో తెలుసుకోవడానికి ఫ్లోట్ ఆర్ సింగ్ అనే టాస్క్  ఇచ్చాడు. ఇందులో ఎవరి ఫోటో అయితే నీటిలో మునిగి పోకుండా ఉంటుందో వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్‏గా కొనసాగుతారని చెప్పాడు. ఒక్కొక్కరు ఎవరు కెప్టెన్ గా అనర్హులో చెబుతూ వారి ఫోటోను ఫూల్ లో పడేయాల్సి ఉంటుందని చెప్పాడు. ఇక ముందుగా శోభా శెట్టి వచ్చి.. ఇక్కడున్న వారందరిలో కంపేర్ చేస్తే నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఫిట్ కాదు.. నీలో ఆ కెప్టెన్సీ పవర్ నాకు కనిపించడం లేదంటూ అశ్విని ఫోటో పట్టుకుంది.

Advertisement

దీంతో నీకు ఎప్పటికీ కనిపించందంటూ కౌంటరిచ్చింది అశ్విని. చివరకు ఆమె ఫోటోను ఫూల్ లో పడేసింది శోభా. ఇక ఆ తర్వాత ఈ టాస్క్  నుంచి ప్రశాంత్ ను తప్పిస్తూ.. అందరికీ అవకాశం రావాలంటూ చెప్పుకొచ్చింది పూజా మూర్తి. దీంతో ప్రశాంత్ మాట్లాడుతూ.. అంటే నీకు ఒకసారి ఛాన్స్ వచ్చింది ఇక అవసరం లేదంటున్నావ్ అంటూ రివర్స్ అయ్యాడు. అయితే అతనితో వాదించలేక ఫోటోను స్విమ్మింగ్ ఫూల్ లో వేసింది పూజా. ఇక ఆ తర్వాత యావర్ వర్సెస్ ప్రియాంక మధ్య గొడవ జరిగింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్..? విడిపోయామంటూ రాజ్ కుంద్రా ట్వీట్..!

 ప్రభాస్ కల్కి సినిమాలో.. రాజమౌళి పాత్ర ఇదే.. అంత పవర్ఫుల్ రోల్ ఆ..?

Visitors Are Also Reading