Home » ఎంపీ, ఎమ్మెల్యే ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. పీవీ నరసింహారావు కేసుకి దీనికి సంబంధం ఏంటి..?

ఎంపీ, ఎమ్మెల్యే ల విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. పీవీ నరసింహారావు కేసుకి దీనికి సంబంధం ఏంటి..?

by Anji
Published: Last Updated on
Ad

చట్టసభల్లో కావాల్సిన అంశంపై మాట్లాడేందుకు ప్రశ్నలు వేయడానికి ఓటు వేసేందుకు ప్రజా, ప్రతినిధులు లంచం తీసుకోవడం పార్లమెంట్ ప్రత్యేకాధికారాల పరిధిలోకి రాదని ఇటీవలే ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. సభల్లో ప్రసంగించేందుకు ఓటు వేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే వారిపై కేసు నమోదు చేయవచ్చని వారికి ఎలాంటి రాజ్యాంపరమైన రక్షణ ఉండదని ఈ తీర్పు స్పస్టం చేసింది.

PV-Narasimha-Rao

Advertisement

 

ఈ తీర్పును వెలువరిస్తూ.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శాసనాధికారుల ఉద్దేశం సభకు సమిష్టిగా ప్రత్యేక అధికారాలు ఇవ్వడమే అన్నారు. ఆర్టికల్ 105, 194 ఆర్టికల్స్ ప్రజాప్రతినిధులకు భయంలేని వాతావరణం  సృష్టించడానికి ఉద్దేశించినవి. కానీ లంచాలు, అవినీతి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై.చంద్రచూడ్ 1998 నాటికి పీవీ నరసింహారావు కేసులో తీర్పును ప్రస్తావిస్తూ.. ఈ కేసులో ఇచ్చిన తీర్పు ఓ విరుద్ధమైన పరిస్థితిని సృష్టించింది. ప్రజాప్రతినిధులు లంచం తీసుకుని తదనుగుణంగా ఓటు వేసినా వారికి రక్షణ కల్పించింది’’ అని పేర్కొన్నట్టు లీగల్ అఫైర్స్ వెబ్‌సైట్  తెలిపింది.  

Advertisement

 

పార్లమెంట్, అసెంబ్లీలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రసంగాలకు, ఓటు వేయడానికి డబ్బలు తీసుకున్నా క్రి**మినల్ విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ.. 1998లో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం 3-2 మెజార్టీతో తీర్పు ఇచ్చింది. లంచాలు తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు రక్షణ కలిస్తున్నపీవీ నరసింహారావు కేసులోని తీర్పును కొట్టివేస్తున్నామని సీజేఐ వెల్లడించినట్టు బార్ అండ్ బెంచ్ వెల్లడించింది. ఏ  ఎంపీ, ఎమ్మెల్యే అటువంటి అధికారం ఉపయోగించుకోలేరు. మొత్తం సభకు సమష్టిగా ప్రత్యేక హక్కు ఉంటుంది. పీవీ నరసింహారావు కేసులో ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 105 (2), 194కు వ్యతిరేకంగా ఉన్నాయని  కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని మోదీ స్వాగతించారు.

Also Read :  ఓటమి ఎరుగని అసదుద్దీన్ పై మాధవీలత పోటీ.. ఈమె ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..?

Visitors Are Also Reading