Home » ఓటమి ఎరుగని అసదుద్దీన్ పై మాధవీలత పోటీ.. ఈమె ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..?

ఓటమి ఎరుగని అసదుద్దీన్ పై మాధవీలత పోటీ.. ఈమె ఎవరు..? బ్యాక్ గ్రౌండ్ ఏంటీ..?

by Anji
Published: Last Updated on
Ad

తెలంగాణలో నవంబర్ 30, 2023న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయింది. అయితే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తోంది. తొలి జాబితాలో 9 మందికి చోటు కల్పించారు. వీరిలో మల్కాజ్ గిరి నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. హైదరాబాద్ స్థానం నుంచి మాధవీ లతను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

Madhavilatha-Background

Advertisement

 

మాధవీలతను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మాధవీ లత ఎవ్వరు..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటీ అని అందరూ గూగుల్ సెర్చ్ చేయడం ప్రారంభించారు. విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్ కొంపెల్ల మాధవీ లత. రిలీజీయస్ యాక్టివిటీస్ లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకత్ పురా నియోజకవర్గంలోని సంతోష్ నగర్ లో పుట్టి పెరిగిన మాధవీలత ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నతవిద్యనభ్యసించింది. భరత నాట్య నృత్యకారిణీ, ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఎంటప్రిన్యూర్ కూడా. అయితే విరించి గ్రూఫ్ ఫౌండర్ కొంపెల్ల విశ్వనాథ్ ని 2001లో పెళ్లి చేసుకున్నారు. కొంపెల్ల విశ్వనాథ్, మాధవీ లత దంపతులకు ముగ్గురు సంతానం. ప్రస్తుతం విరించి ఆసుపత్రి సీఎండీగా మాధవీ లత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లతామా ఫౌండేషన్ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. 

Advertisement

హిందుత్వం, భారతీయ సంస్కృతీపై అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోషాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఇన్ని రోజులు కేవలం సామాజిక సేవలు చేసిన మాధవీ లత తొలిసారిగా రాజకీయంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం అడ్డా.. 1984 నుంచి 2004 వరకు సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసీ ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. సుల్తాన్ సలా ఉద్దీన్ ఓవైసీ ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తండ్రి. అసదుద్దీన్ ఓవైసీ 2004, 2009, 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఈసారి ఎలాగైనా అసదుద్దీన్ కి చెక్ పెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎదురులేని నేతగా ఓవైసీని గట్టి దెబ్బ కొట్టాలన్నది బీజేపీ ప్లాన్. ఈసారి ఎలాగైనా అసదుద్దీన్ ని ఓడించాలని నారీ శక్తిని రంగంలోకి దింపింది బీజేపీ. ఇప్పటికే రెండు, మూడు సార్లు బీజేపీ అభ్యర్థి రెండో స్థానం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అసదుద్దీన్ ని ఓడించాల్సిందేనని అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీ లతను బరిలోకి దింపింది బీజేపీ. కమలం పార్టీ ఫ్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ. 

Visitors Are Also Reading