Home » ఖుషి నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఆరాధ్య సాంగ్ అదుర్స్..!

ఖుషి నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఆరాధ్య సాంగ్ అదుర్స్..!

by Anji
Ad

లైగర్ మూవీ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ 01న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ ని ప్రారంభించింది టీమ్. అందులో భాగంగానే ఇప్పటికే విడుదల చేసిన నా రోజా నువ్వే అనే పాటకి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. హిషామ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి ఈ పాటను తానే పాడాడు. దర్శకుడు శివ నిర్వాణ రాయడం ఓ విశేషం అయితే.. నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే అంటూ పాట మొత్తంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా సాహిత్యం ఉండటం మరో విశేషం. 

Advertisement

ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ ను విడుదల చేసింది. ముందస్తుగా నే సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్టు ఓ పోస్టర్  కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను సిద్ శ్రీరామ్, చిన్మయి శ్రీపాద పాడారు. శివ నిర్వాణ రచించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ వంటి భాషల్లో ఒకేసారి విడుదలై ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

Advertisement

ఈ సినిమాలో విజయ్, సమంతతో పాటు ఇతర కీలక పాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ దివ్యాంశ కౌషిక్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దివ్యాంశ కౌషిక్ కూడా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దివ్యాంశ కౌశిక్ సమంతకి చెల్లి పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సమంత, దివ్యాంశ గతంలోనే నాగచైతన్య హీరోగా నటించి మజిలీ మూవీలో కలిసి నటించారు. ఖుషి మూవీ అలా ఉండగానే.. విజయ్ మరోసారి తనకు గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ తో ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. సంక్రాంతి బరిలో ప్రాజెక్ట్ కే, రవితేజ ఈగల్ వంటి సినిమాలు ప్రకటించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది..!

సినిమాల్లోకి రాకముందు కమెడియన్ సత్య అలాంటి పనులు చేసేవాడట..

ఆ మూవీ చేయకూడదని అనుష్కకి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!

Visitors Are Also Reading