Home » ఆ మూవీ చేయకూడదని అనుష్కకి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!

ఆ మూవీ చేయకూడదని అనుష్కకి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!

by Anji
Ad

తెలుగు సినీ ప్రేక్షకులకు చాలా దగ్గరైన హీరోయిన్లలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి ఒకరు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో అగ్ర నటిగా పేర్గాంచింది. ఓవైపు లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ దూసుకుపోయింది. 

Advertisement

ఒకానొక సమయంలో చాలా బొద్దుగా తయారుకావడం, ఇక ఆమె వయస్సు కూడా పెరిగిపోవడంతో ఆఫర్లు కొంతమేరకు తగ్గాయి. దీంతో అనుష్క భాగమతి తరువాత మళ్లీ వెండితెరపై ఎక్కడా కనిపించలేదట. ఇదిలా ఉండగా.. చాలా కాలం తరువాత మహేష్ బాబు పి దర్శకత్వంలో అనుష్క-నవీన్ పొలిశెట్టి జంటగా తెరకెక్కుతున్న మిస్ మిస్టర్ పొలిశెట్టి అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఆగస్టు 04న తేదీన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారంటూ చాలా కాలం నుంచి ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ ని వాళ్లు ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. కానీ వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగా అనుష్కకి ఓ మూవీ ఆఫర్ వచ్చిన వెంటనే ఆ స్ట్రిప్ట్ గురించి వెంటనే ప్రభాస్ కి ఫోన్ చేసి చెప్పిందట అనుష్క. ఇక ఆ కథ విన్న వెంటనే ఆ సినిమా చేయవద్దని అనుష్కకి సీరియస్ వార్నింగ్ ఇచ్చాడట ప్రభాస్. 

Advertisement

ఆ సినిమా మరేదో కాదు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించిన వేదం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుష్క, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. స్టార్ హీరోయిన్ హోదాలో అనుష్క ఆ సమయంలో వెండితెరపై ఓ వేశ్యగా కనిపించడంతో ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయిందని అంతా భావించారు.  ఇలాంటివి ఏవో జరుగుతాయనే ప్రభాస్ ఈ సినిమా చేయకూడదని అనుష్కని హెచ్చరించారట. ఈ సినిమా విడుదలైన తరువాత అనుష్క నటించిన సరోజా పాత్ర విమర్శకుల ప్రశంసలను అందుకుంది. స్విటీ నటించిన సినిమాల్లో ఎప్పటికీ మరిచిపోలేని పాత్రల్లో సరోజా పాత్ర కూడా ఒకటిగా నిలిచింది. సరోజా పాత్రను దర్శకుడు క్రిష్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుందని మళ్లీ అనుష్కకి ఫోన్ చేసి చెప్పాడట ప్రభాస్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 హీరో అజిత్ గురించి ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. ఎందుకంటే..?

హీరో అజిత్ గురించి ఆ నిర్మాత సంచలన వ్యాఖ్యలు.. ఎందుకంటే..?

Visitors Are Also Reading