Home » హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది..!

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్ ఎన్టీఆర్ బావమరిది..!

by Anji
Ad

సాధారణంగా ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా వారసత్వం, బంధుత్వమే.. అలా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం ఇలా అన్ని ఇండస్ట్రీలలో ప్రస్తుతం ఉన్నటువంటి చాలా మంది హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులు ఇండస్ట్రీలో ఏదో ఓ సంబంధం పెట్టుకొని ఎంట్రీ ఇస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి బంధుత్వం లేకుండా ఎదిగిన వాళ్లలో కొంతమంది హీరో, హీరోయిన్లు మాత్రమే ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, హరికృష్ణ నట వారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 

Advertisement

అంతేకాదు.. వారి బంధువులు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరీ ఆ విశేషాలు ఏంటో చూద్దామా.. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. బన్నీవాసు నిర్మాణంలో ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఆయనకు సంబంధించిన సినిమా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Advertisement

ఏ క్షణంలోనైనా ఆయన ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. నితిన్ ఇప్పటికే శ్రీశ్రీశ్రీ రాజా వారు అనే సినిమా ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో వస్తుందని అప్పటితో ప్రకటించారు. పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ మూవీ ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. కనీసం ఆ సినిమా గురించి మరో అప్డేట్ కూడా రాలేదు. తాజాగా ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరోగా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న తరుణంలో పాత సినిమానే పూర్తి చేస్తున్నట్టు కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గీతా ఆర్ట్స్ బ్యానర్ కొత్త హీరో, హీరోయిన్లకు ఎంతో కలిసి వస్తుంది. అయితే నార్నే నితిన్ కి ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

సావిత్రి ఆఖరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి బయటకు తెలియక పోవడానికి కారణమేమిటంటే ..!

 సినిమాల్లోకి రాకముందు కమెడియన్ సత్య అలాంటి పనులు చేసేవాడట..

Visitors Are Also Reading