Home » అమ్మ బాబోయ్: పిల్లి పిల్ల అనుకోని పులి పిల్లను ఇంటికి తెచ్చిన చిన్నారి… చివరికి..?

అమ్మ బాబోయ్: పిల్లి పిల్ల అనుకోని పులి పిల్లను ఇంటికి తెచ్చిన చిన్నారి… చివరికి..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఆ చిన్నారి సాధారణంగా అందరి పిల్లల్లాగే ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది. ఆ తర్వాత కాసేపటికి ఇంటికి తిరిగి వచ్చింది. అయితే వస్తూ వస్తూ ఆ చిన్నారి ఒంటరిగా రాలేదు.తనతో పాటు ఓ కూనను కూడా ఇంటికి తీసుకు వచ్చింది. అయితే ఆమె వెంట వచ్చిన ఆ కూనను చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యారు. ఎందుకు షాకయ్యారంటే ఆ పాప పిల్లి పిల్ల అనుకొని చిరుతపులి పిల్లను వెంట తీసుకు వచ్చింది. అయితే ఆ చిరుత పిల్ల వయసు కేవలం రోజుల వయసు ఉండడంతో ఎవరిని ఏం చేయలేదు. అయితే ఈ ఘటన మహారాష్ట్రలోని మాలెగావ్ లోని మోర్చార్ శివారు ప్రాంతంలో చోటు చేసుకుంది.అయితే ఆ కుటుంబ సభ్యులు మాత్రం చాలా సాహసమే చేశారు. ఆ చిరుత పిల్ల కోసం తల్లి చిరుత పులి వస్తుందేమోనని వారం రోజుల పాటు తమ దగ్గరే పెట్టుకున్నారు. కానీ చిరుత పులి మాత్రం ఆ ప్రాంతంలోకి వచ్చిన ఆనవాళ్ళు కనిపించలేదు. దాంతో ఆ కుటుంబ సభ్యులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం అందించారు.ఆ కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు వచ్చి ఆ చిరుత కూనను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వారం రోజులపాటు ఆ చిరుత పిల్లను కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా కాపాడారు. దానికి రోజూ పాలు పోస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచారు. దాన్ని జాగ్రత్తగా చూస్తూనే మరోవైపు ఆ చిరుత కూన కోసం దాని తల్లి చిరుత ఎటువైపు నుంచి వస్తుందో అని ఆ కుటుంబ సభ్యులు భయపడ్డారు. కానీ ఆ చిరుత కూనను తీసుకు వచ్చిన చిన్నారి మాత్రం దాంతో ఎంతో సంబరంగా ఆడుకుంది. అయితే ఈ ఘటన స్థానికంగా ఎంతో కలకలం రేపింది. ఆ చిరుత పిల్లను ఏవైనా పక్షులు ఎత్తుకొచ్చి ఆ ప్రాంతంలో పడేసి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

పెద్ద‌దేవుడికి కొత్త కోడ‌ళ్ల ప‌రిచ‌యం.. అడ‌వుల జిల్లాలో పెర్స‌పేన్ ఉత్స‌వం

సాయంత్రం స‌మ‌యంలో గోర్లు క‌త్తిరించ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

 

Visitors Are Also Reading