Home » సాయంత్రం స‌మ‌యంలో గోర్లు క‌త్తిరించ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

సాయంత్రం స‌మ‌యంలో గోర్లు క‌త్తిరించ‌కూడ‌దు అంటారు ఎందుకో తెలుసా..?

by Anji
Ad

భార‌త‌దేశంలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌లంద‌రూ చాలా ఏళ్ల నుంచి ఈ సాంప్ర‌దాయాన్ని పాటిస్తారు. సాయంత్రం లైట్స్ ఆన్ చేసిన త‌రువాత నూరు ఆరు అయినా గోర్ల‌ను ఎట్టి ప‌రిస్తితిలో క‌త్తిరించ‌కూడ‌దు అని హెచ్చ‌రిస్తున్నారు. పొర‌పాటున ఎవ‌రైనా క‌త్తిరిస్తే ఇక వాళ్ల‌కు ఇంట్లో వారికి ఇంట్లో సుప్ర‌భాతాల లాంటి తిట్లు త‌ప్ప‌వు. సంధ్యా స‌మయంలో ల‌క్ష్మీదేవి ఇంటికి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో గోర్లు క‌త్తిరిస్తే అశుభం అనే చెబుతారు. కానీ క‌చ్చితంగా ఎందుకు క‌త్తిరించ‌కూడ‌దంటే మాత్రం అస‌లు చెప్ప‌రు. కొంద‌రూ ఈ ఆచారాన్ని నేటికీ మూఢ‌న‌మ్మ‌కంగానే భావిస్తున్నారు. వాస్త‌వానికి మన పెద్ద‌లు చెప్పే ప్ర‌తి విష‌యానికి ఏదో ఒక సైంటిఫిక్ రీజ‌న్ ఉంటుంది.

Advertisement

ఇది అలా ప‌క్క‌కు పెడితే సాయంత్రం వేళ గోర్లు తొల‌గించ‌కూడ‌ద‌నే ఆలోచ‌న కేవ‌లం భార‌త‌దేశానికే పరిమితం కాలేదు. ప్ర‌పంచ దేశాలు సైతం ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయంటే మీరు న‌మ్ముతారా..? కానీ ఇదే నిజం. దీనిని చెడుకు సంకేత‌మో లేక ద‌య్యాలు వ‌స్తాయ‌నో ఇలా చేయ‌కూడ‌ద‌ని పెద్ద‌లు పేర్కొంటారు. వాస్త‌వానికి ఈ న‌మ్మ‌కాల వెనుక బ‌ల‌మైన శాస్త్రీయ కార‌ణమే ఉంది. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


పూర్వ‌కాలంలో ప్ర‌స్తుతం ఉన్న‌ట్టు ప్ర‌తిచోట ట్యూబ్‌లైట్లు లేవు. అస‌లు క‌రెంట్ లేదు. ఆ స‌మ‌యంలో సూర్యాస్త‌మ‌యం త‌రువాత చిమ్నీలు, బుడ్డీదీపాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఉన్న‌ట్టు నెయిల్ అప్పుడు నెయిల్ క‌ట్ట‌ర్లు కూడా లేవు. అందుకే గోర్ల‌ను క‌ట్ చేయ‌డానికి వారు క‌త్తి లేదా బ్లేడ్ల‌ను వినియోగించేవారు. సూర్య‌స్త‌మ‌యం త‌రువాత చీక‌టిలో ప‌దునైన వ‌స్తువుల‌ను వినియోగిస్తే వేళ్లు క‌ట్ అయ్యే అవ‌కాశం ఉంటుంది. అందుకే రాత్రి స‌మ‌యంలో గోర్ల‌ను క‌త్తిరించ‌కూడ‌ద‌నేవారు. అప్ప‌ట్లో కూడా కొంత మంది మొండిగా ప్ర‌వ‌ర్తించి గోర్ల‌ను తొల‌గించేవార‌ట‌. అలా చేయ‌కూడ‌ద‌ని.. దేవుడు లేదా దెయ్యం పేరు చెప్పి వారిని గోర్లు తీసుకోకుండా చేసేవారు.ఇందులో వాస్త‌వం ఏమిటంటే.. శాస్త్రీయ కార‌ణాల కంటే మూఢ‌న‌మ్మ‌కాలు చెప్పిన‌ప్పుడే జ‌నాలు ఎక్కువ‌గా న‌మ్ముతారు.

Advertisement

అందుకే విన‌ని వాళ్ల‌కు అలా చెప్పేవారు. అదేవిధంగా ప‌గ‌టిపూట ఇంట్లో చేతి లేదా కాళు గోర్ల‌ను క‌ట్ చేయ‌డం మూలంగా అప‌రిశుభ్ర‌మైన మృత చ‌ర్మ క‌ణాలు ఇంట్లో అక్క‌డ‌క్క‌డా ప‌డిపోవ‌చ్చు. అవి ఆహారాన్ని క‌లుషితం చేస్తాయి. చ‌నిపోయిన చ‌ర్మ క‌ణాలు అనారోగ్యం, సంక్ర‌మ‌ణ‌కు కార‌ణ‌మ‌య్యే సూక్ష్మ‌జీవుల‌కు నివాసంగా మారొచ్చు. ఇంట్లో ఉన్న చిన్న పిల్ల‌లు వీటిని నోట్లో వేస‌సుకునే ప్ర‌మాద‌మున్నందున ఇంట్లో స‌సాయంత్రం గోర్ల‌ను తొల‌గించ‌కుండా ఉండ‌డానికి ఇది ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. అందుకే గాయాన్ని సంక్ర‌మ‌ణ‌ను నిరోధించ‌డానికి, క్ర‌మ శిక్ష‌ణ‌ను బోధించ‌డానికి ప్ర‌జ‌లు సూర్యాస్త‌మ‌యం త‌రువాత త‌మ గోళ్ల‌ను కోసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇది శాస్త్రీయ కార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ మూఢ‌న‌మ్మ‌కంగానే ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. ఇక కొంత మంది అయితే ఎప్పుడు చేతి వేళ్ల‌ను నోట్లో పెట్టుకునే అదే ప‌నిగా కొరుకుతుంటారు. అలా చేస్తే ఆరోగ్యానికి హాని క‌ర‌మే. చేతి గోర్ల‌లో ఉండే మ‌ట్టి నోట్లోకి పోయే ప్ర‌మాదం ఉంటుంది. అందుకే జాగ్ర‌త్త వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది.

Also Read : 

1986 లో డబల్ హ్యాట్రిక్ విజయాలతో ఇండస్ట్రీకి స్టార్ హీరో గా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ !

రెబల్ స్టార్ ప్రభాస్ లైఫ్ లో ఇంతటి విషాదం దాగి ఉందా ? తండ్రి అడిగిన ఆ కోరికని తీర్చలేకపోయారా ?

Visitors Are Also Reading