Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » The Kerala Story: ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. ఎప్పటినుంచి చూడొచ్చంటే..

The Kerala Story: ఓటీటీలోకి ‘ది కేరళ స్టోరీ’.. ఎప్పటినుంచి చూడొచ్చంటే..

by Bunty
Ads

ఆదాశర్మ హీరోయిన్ గా నటించిన తాజా సినిమా ది కేరళ స్టోరీ. ఈ సినిమా దేశవ్యాప్తంగా వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. దర్శకుడు సుదీప్ తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆదాశర్మ ప్రధాన పాత్రలో నటించింది.

Advertisement

Ad

అలాగే యోగిత బిహాని, సిద్ధి, సోనియా బలానికి కీలక పాత్రలో నటించారు. కేరళ రాష్ట్రంలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐ.ఎస్.ఐ.ఎస్ క్యాంపుల్లోకి పంపించి… దేశ వ్యతిరేకులుగా మార్చారనే కథ తో ఈ సినిమా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాకు వ్యతిరేకంగా చాలామంది ధర్నాలు, నిరసనలు తెలిపారు.

Advertisement

kerala-story-review

అయినప్పటికీ ఇప్పటికీ… ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈతరణంలో ఈ సినిమా గురించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా జూన్ 23వ తేదీ నుంచి జీ 5 అనే OTT ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Ms Dhoni : ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆస్పత్రి పాలైన మహేంద్ర సింగ్ ధోని

వేల కోట్లు సంపాదించే BCCI ట్యాక్స్‌ ఎందుకు కట్టదో మీకు తెలుసా?

పాక్ లోనూ ధోని క్రేజ్ మామూలుగా లేదుగా.. అభిమానులు ఏం చేశారంటే

Visitors Are Also Reading