Home » Egg : ఈ కోడిగుడ్డు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

Egg : ఈ కోడిగుడ్డు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Anji
Ad

కోడి గుడ్ల‌లో వేరియేష‌న్స్ చాలానే ఉంటాయ‌ని మ‌న‌కు తెలిసిందే. తెల్ల‌ని గుడ్లు, బ్రౌన్ క‌ల‌ర్ గుడ్లుంటాయి. రెండు ప‌చ్చ‌సొన‌లు ఉన్న గుడ్లు కూడా ఉంటాయి. అయితే ప‌రిమాణం విష‌యానికొస్తే అన్ని గుడ్లు గుండ్రంగా కొద్దిగా పొడ‌వుగా ఉంటాయి. కొన్ని గుడ్లు పెద్ద ప‌రిమాణంలో ఉంటే మ‌రికొన్ని గుడ్లు చిన్న‌గా ఉంటాయి. మొత్తానికి గుండ్రంగానే ఉంటాయి. అయితే తాజాగా ఓ కోడి పెట్టిన గుడ్డు మాత్రం చిత్ర విచిత్రంగా ఉంది. ఆ గుడ్డును చూసి జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇదేమి కోడి రా బాబూ ఇలా పెట్టింది. గుడ్డూ అంటూ షాక్ అవుతున్నారు. ఈ వింత గుడ్డు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

Advertisement

ఏపీలో వెలుగులోకి వ‌చ్చిన ఈ వింత కోడిగుడ్డుకు సంబంధించిన వివ‌రాలున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లా వీఆర్‌పురం మండ‌లంలోని రాజుపేట కాల‌నీలో ముంజ‌పు స‌త్య‌నారాయ‌ణ నాటు కోళ్ల‌ను సాకుతున్నారు. అయితే కోడిపెట్ట రోజు మాదిరిగానే ఆదివారం గూట్లోకి వ‌చ్చి ఒక గుడ్డు పెట్టింది. అనంత‌రం వెళ్లిపోయింది. స‌త్యనారాయ‌ణ కోడి పెట్టిన గుడ్డును తీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. వింత ఆకారంలో గుడ్డు క‌నిపించింది.

గుండ్రంగా ఉండాల్సిన గుడ్డు వంపు తిరిగి ఉండ‌డం చూసి షాక్ అయ్యాడు. తొలుత అది కోడిగుడ్డు కాద‌నుకున్నారు. కానీ ఆ త‌రువాత ప‌రిశీలించి చూడ‌గా.. గుడ్డు అని నిర్ధారించుకున్నారు. ఈ మెలితిరిగి ఉన్న గుడ్డును ఫొటో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. అదికాస్తా వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు గుడ్డును చూసి షాక్ అవుతున్నారు. జ‌న్యుప‌ర‌మైన లోపాల కార‌ణంగానే గుడ్డు అలాగే ఉంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ వింత గుడ్డును చూసి నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Also Read :  ఏపీ కేబినెట్ కీల‌క‌ నిర్ణ‌యం.. రాష్ట్రంలో రెండో భాష‌గా ఉర్దూ..!

Visitors Are Also Reading