Home » పెను ప్రమాదం నుంచి బయటపడ్డ సుమ.. ఏం జరిగిందంటే..!!

పెను ప్రమాదం నుంచి బయటపడ్డ సుమ.. ఏం జరిగిందంటే..!!

Ad

తెలుగు ఇండస్ట్రీ లోనే టాప్ యాంకర్లలో సుమ ఒకరు. ఆమె మాటలతో ఎంతటి వారినైనా ఆకట్టుకునే శక్తి చాకచక్యం గల యాంకర్ అని చెప్పవచ్చు. ఆమె మైకు పట్టిందంటే నవ్వులతో నిండి పోవాల్సిందే. అలాంటి సుమకు ఏం జరిగిందో తెలుసుకుందాం..!! బుల్లితెర యాంకర్ సుమకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జయమ్మ పంచాయతీ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చాలా కాలం తర్వాత సుమ నటించిన సినిమా జయమ్మ పంచాయతీ.

ఈ సినిమాలో సుమ ప్రధాన పాత్రలో నటించింది. మే 6 న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో యాంకర్ సుమ గారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్న నీటి ప్రవాహం ఉన్న రాతిపై నిల్చొని పక్కనే ఉన్న రాళ్లను పట్టుకొని నీటిని చూస్తున్నారు సుమ. అలా నిల్చొని ఉన్నప్పుడు అనుకోకుండా ఆమె కాలు జారి పడి పోయారు.

Advertisement

Advertisement

అయితే ఆ ప్రమాదంలో సుమకు ఏమీ జరగలేదు. ప్రమాదం నుండి సుమ క్షేమంగా బయటపడడంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోని సుమ తన ఇన్స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అందరూ జాగ్రత్త సుమ గారు.. టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ;

ఎంసెట్‌, నీట్, జేఈఈ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. వారికి ఉచిత శిక్ష‌ణ‌

కార్య‌క‌ర్త ఇంట్లో బ‌స‌.. సాధార‌ణ సౌక‌ర్యాలు లేని వ‌ద్ద మంత్రి స్నానం..!

 

Visitors Are Also Reading