Home » కార్య‌క‌ర్త ఇంట్లో బ‌స‌.. సాధార‌ణ సౌక‌ర్యాలు లేని వ‌ద్ద మంత్రి స్నానం..!

కార్య‌క‌ర్త ఇంట్లో బ‌స‌.. సాధార‌ణ సౌక‌ర్యాలు లేని వ‌ద్ద మంత్రి స్నానం..!

by Anji
Ad

సాధార‌ణంగా మంత్రులు అంటే ల‌గ్జ‌రీ లైఫ్ అనుభ‌విస్తుంటారు. ఎప్పుడో ఎన్నికల ప్ర‌చారం అప్పుడు అక్క‌డ ఇక్క‌డ మ‌కాం వేస్తుంటారు. కానీ ఓ మంత్రి కార్య‌క‌ర్త నివాసంలో రాత్రి పూట బ‌స‌చేసి సామాన్యుడిలా చేతి పంపు వ‌ద్ద స్నానం చేసారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మంత్రి నంద‌గోపాల్ గుప్త అలియాస్ నంది. చేతి పంపు వ‌ద్ద మంత్రి స్నానం చేసిన వీడియోతో పాటు విధుల‌కు సిద్ధ‌మ‌వుతున్న మ‌రొక క్లిప్‌ను త‌న ట్విట్ట‌ర్‌లో మంత్రి పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. యూపీలో ఎలాంటి వీఐపీ సంస్కృతి లేద‌ని మంత్రి నంద‌గోపాల్ గుప్త తెలిపారు. దీనిని తెలియ‌జేసేందుకు ఓ గ్రామ‌స్తుడి మాదిరిగా ఇంట్లో ఆయ‌న స్నానం చేసిన వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసాడు.

Advertisement

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రి నంద‌గోపాల్ గుప్త నంది ఇటీవ‌ల షాజ‌హాన్ పూర్ జిల్లాతో పర్య‌టించారు. చాక్ క‌న్హావు గ్రామాన్ని సంద‌ర్శించే స‌మ‌యానికి ఆయ‌న బాగా అల‌సిపోయారు. దీంతో అక్క‌డే ఓ కార్య‌క‌ర్త ఇంట్లో విశ్ర‌మించిన ఆయ‌న మ‌రుస‌టిరోజు ఉద‌యం అక్క‌డ చేతిపంపు వ‌ద్ద స్నానం చేసారు. సాధార‌ణ బాత్రూం అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఆడంబ‌రాల‌కు పోకుండా స్నానం ముగించారు. దీనిపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ.. త‌మ ప్ర‌భుత్వంలో వీఐపీ సంస్కృతి లేద‌ని.. నిరాడంబ‌ర‌త‌కే అత్య‌ధిక ప్రాధాన్య‌త ఉంటుందని స్ప‌ష్టం చేసారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియోను మంత్రి నంద‌గోపాల్ గుప్త‌నే స్వ‌యంగా షేర్ చేసారు. గ‌తంలో బీఎస్పీ, కాంగ్రెస్ నాయ‌కుడైన నంద గోపాల్ 2017లో బీజేపీలో చేరాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అల‌హాబాద్ ద‌క్షిణ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుండి గెలిచారు. ప్ర‌స్తుతం యోగి ప్ర‌భుత్వంలో పారిశ్రామికాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ని చేస్తున్నారు.

Advertisement

ఉద‌యం టీతో రోజు ప్రారంభ‌మైంది. షాజ‌హాన్ పూర్ జిల్లా సింధౌలీ డెవ‌ల‌ప్‌మెంట్ బ్లాక్ లోని చ‌క్ క‌నాహు గ్రామంలో లీల్‌రామ్ భార్య స‌హోద‌ర ఇంట్లో గ‌త రాత్రి బ‌స చేసారు. చేతి పంపులోని నీళ్ల‌తో అక్క‌డ స్నానం చేసాన‌ని మంత్రి నంద గోపాల్ గుప్త టిట్వ‌ర్‌లో వెల్ల‌డించారు. ముఖ్యంగా యోగి ప్ర‌భుత్వానికి గ‌త ప్ర‌భుత్వాల‌కు ఉన్న తేదా ఇదే అన్నారు. యోగి ప్ర‌భుత్వం, సామాన్యుల‌కు మ‌ధ్య ఎటువంటి దూరం లేదా తేడా లేదు. అదేవిధంగా వీఐపీ క‌ల్చ‌ర్ కూడా లేద‌ని మ‌రొక ట్వీట్ చేసారు.

Also Read : 

బాహుబలి సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా…జక్కన్న మరీ ఇంత చిన్న లాజిక్ ఎలా …?

డ్రైవ‌ర్‌ను వ‌రించిన అదృష్టం.. రాత్రికి రాత్రి రూ.2కోట్ల జాక్‌పాట్..!

Visitors Are Also Reading