Home » ఎంసెట్‌, నీట్, జేఈఈ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. వారికి ఉచిత శిక్ష‌ణ‌

ఎంసెట్‌, నీట్, జేఈఈ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. వారికి ఉచిత శిక్ష‌ణ‌

by Anji
Ad

ఎంసెట్‌, నీట్‌, జేఈఈ త‌దిత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే స‌ర్కారు క‌ళాశాల‌లోని విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఆ విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా ఉచిత శిక్ష‌ణ ఇచ్చేందుకు ఇంట‌ర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. శిక్ష‌ణ‌ను మే చివ‌రి వారం నుంచి ఉచిత శిక్ష‌ణ ప్రారంభించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో శిక్ష‌ణ ఇవ్వాల‌ని అధికారులు నిర్ణయించారు. ఆన్‌లైన్ క్లౌడ్ ఎడ్జ్ సంస్థ స‌హ‌కారంతో ఉచిత శిక్ష‌ణ ఇస్తారు. అదేవిధంగా జిల్లాల్లో 32 కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసారు. మే 20, 2022 లేదా మే 21, 2022 నుంచి ఉచిత శిక్ష‌ణ ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. విద్యార్థులు tscie.rankr.io లింక్ ద్వారా ఇంట్లో ఉండి కోచింగ్ తీసుకోవ‌చ్చు.

Advertisement

Advertisement

గ‌త ఏడాది సైతం ఇదే త‌ర‌హా శిక్ష‌ణ ఇవ్వ‌గా.. రాష్ట్రంలో 20వేల మంది విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకున్నారు. అందులో 2,685 మంది విద్యార్థులు ఉత్త‌మ ర్యాంకు సాధించారు. దేశంలోనే అత్యంత పేరొందిన పోటీ ప‌రీక్ష‌ల్లో నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఒక‌టి. మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే ఈ ఎగ్జామ్ కు పోటీ విప‌రీతంగా ఉంటుంది. డాక్ట‌ర్ కావాల‌న్న క‌లతో ల‌క్ష‌లాది మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌కు ఏళ్ల పాటు ప్రిపేర్ అవుతుంటాయి. చాలా మంది ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి కోచింగ్ తీసుకుంటారు.

అనేక మంది పేద విద్యార్థులు కోచింగ్ కోసం డ‌బ్బులు ఖ‌ర్చు చేసే స్థోమ‌త లేక ఇంట్లోనే ఉండి సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న స్ట‌డీ మెటీరియ‌ల్ ఇత‌ర పుస్త‌కాల‌తో వారు ప్రిప‌రేష‌న్ సాగిస్తారు. అలాంటి విద్యార్థుల‌కు ఓ శుభ‌వా. కేవ‌లం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. నీట్ ఎగ్జామ్‌కు ఇంట్లో నుంచే ఉచితంగా కోచింగ్ పొందే అవ‌కాశ‌ముంది. Affinity Education App మీకు ఆ అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది.

Also Read : 

కార్య‌క‌ర్త ఇంట్లో బ‌స‌.. సాధార‌ణ సౌక‌ర్యాలు లేని వ‌ద్ద మంత్రి స్నానం..!

“మ మ మహేషా” పాటను తమన్ అక్కడ నుండి కాపీ కొట్టారా…మక్కీ టూ మక్కీ దింపేసాడు అంటూ దారుణమైన ట్రోల్స్….!

Visitors Are Also Reading