Home » మెగాస్టార్ అభిమానులకు శుభవార్త.. వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడే ?

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త.. వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేది అప్పుడే ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం మెగాస్టార్ వరుస సినిమాలతో బిజీగానే గడుపుతున్నారు.   బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నారు.   వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కనిపించబోతున్న విసయం తెలిసిందే.  ఇద్దరూ స్టార్స్ ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటిస్తోంది. ఇటీవలే విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్ కి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, వాకింగ్ స్టైల్, గెటప్ మాస్ కి పూనకాలే తెప్పించింది.

Advertisement

తాాజాగా వాల్తేరు వీరయ్య నుంచి ఓ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ని ఈ వారమే విడుదల కాబోతుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదలవుతోంది. పార్టీకి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది బాస్ పార్టీ అని ట్వీట్ చేశారు.

Also Read :  “ఆర్య” సినిమా క్యూట్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

Advertisement

ఇక  ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, గ్లామరస్ క్వీన్ ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్ లో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకి కొరియో గ్రఫీ చేశారు. ఈ పాటని ఈ వారమే విడుదల చేయనున్నారు మేకర్స్. చిరంజీవి- దేవీ శ్రీ కాంబో గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. వీరి కాంబోలో వచ్చిన చిత్రాలు చాలా సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఆల్బమ్స్  పై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.  వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదలవ్వనున్నట్టు సమాచారం. తేదీ కాస్త అటు ఇటు అయినా మొత్తానికి సంక్రాంతి పండుగకి మెగాస్టార్ విందు భోజనం ఇవ్వనున్నారు.

Also Read :  ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి.. ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading