Home » “ఆర్య” సినిమా క్యూట్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

“ఆర్య” సినిమా క్యూట్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలోకి చాలా మంది న‌టీన‌టులు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే అందులో కొంత‌మంది మాత్రమే ఎక్కువ కాలం రాణిస్తూ ఉంటారు. చాలా మంది రెండు మూడు సినిమాలు చేసి ఆ త‌ర‌వాత స‌రైన ఆఫ‌ర్ లు లేక‌పోవ‌డంతో క‌నుమ‌రుగు అవుతుంటారు. మొద‌టి సినిమాతోనే ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న హీరోయిన్ లు కూడా స‌రైన ఆఫ‌ర్ లు లేక‌పోతే ఇండ‌స్ట్రీకి దూరం అవ్వాల్సిందే.

Advertisement

అలా ఇండ‌స్ట్రీకి దూరమైన వాళ్లు కొంత‌మంది ఇప్ప‌టికే పెళ్లిళ్లు చేసుకుని భ‌ర్త‌ల‌తో కాపురం చేస్తుండ‌గా మ‌రికొంద‌రు ఇత‌ర రంగాల‌లో స్థిర‌ప‌డ్డారు. ఆ లిస్ట్ లో ఆర్య సినిమా హీరోయిన్ గా కూడా ఒక‌రు. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ హీరోగా న‌టించగా అను మొహ‌తా హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాలో డీసెంట్ లుక్ లో చాలా క్యూట్ గా కనిపిస్తూ అను మెహ‌తా ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

Advertisement

మొద‌టి సినిమాతోనే అను మెహ‌తాకు టాలీవుడ్ లో ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అయితే మొద‌టి సినిమా సూప‌ర్ హిట్ అయిన‌ప్ప‌టికీ అను అందానికి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర‌వాత ఆశించిన మేర ఆఫ‌ర్ లు అందుకోలేక‌పోయింది. అయితే చాలామంది అభిమానుల‌కు ఇప్పుడు అను మెహ‌తా ఎలా ఉంది ఏం చేస్తుంది అని తెలుసుకోవాల‌ని ఆస‌క్తి ఉంటుంది.

అను మెహ‌తా చివ‌ర‌గా క‌న్న‌డ‌లో హుంగ‌న అనే సినిమాలో న‌టించింది. ఈ సినిమా 2008లో తెర‌కెక్కింది. ఆ త‌రవాత పూర్తిగా సినిమాల‌లో క‌నిపించ‌కుండా పోయింది. కాగా రీసెంగ్ గా ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అందులో సాగ‌ర‌తీరాణ అందాల ప్ర‌ద‌ర్శన చేస్తోంది. ఇక ఫోటోలు వైర‌ల్ అవ్వ‌డంతో ఈ అమ్మ‌డు రీఎంట్రీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. మ‌రి ఎలాంటి ఆఫ‌ర్ లు వ‌స్తాయో చూడాలి.

Visitors Are Also Reading