Telugu News » Blog » ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి.. ఎందుకో తెలుసా ?

ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి.. ఎందుకో తెలుసా ?

by Anji
Ads

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది సినిమా వాళ్లకు ఆయన స్పూర్తిదాయకం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఆదర్శపరమైన సినిమాలు చేశారు ఎన్టీఆర్. వాస్తవానికి ఎన్టీఆర్ కంటే ముందుగానే ఫైర్ బ్రాండ్ నటి భానుమతి సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే భానుమతి కేవలం నటిగానే మాత్రమే కాకుండా.. డ్యాన్స్, పాటలు పాడడం, సినిమాలకు దర్శకత్వం వహించడం, కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మరికొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా చేశారు. సినీ ఇండస్ట్రీలోని దాదాపు అన్ని రంగాల్లో భానుమతి గారు ప్రవేశించారు. ఇక అప్పట్లో భానుమతి గారికి చాలా డిమాండ్ ఉండేది. ఆమెతో సినిమాల కోసం హీరోలు సైతం వేచి ఉండేవారు. ఎన్టీఆర్ తో భానుమతి ఎన్నో సినిమాలను చేశారు.

Advertisement

NTR Bhanumathi

NTR Bhanumathi

ఇప్పటి మాదిరిగా అప్పట్లో వాటేసుకోవడం వంటివి అంతగా ఉండేవి కాదు. ఇక అలాంటి వాటిలో భానుమతి చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. పాటల సమయంలో కూడా కనీసం ఆమె చేయిని కూడా తాకనిచ్చేవారు కాదు. మల్లీశ్వరి సినిమాలో ఎన్టీఆర్ తో పాటు భానుమతి నటించారు. ఈ సినిమాలో ఓ సందర్భంలో ఇద్దరూ కౌగిలించుకునే సన్నివేశం ఒకటి ఉంది. అయితే తొలుత ఆ సీన్ నేను చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిందట భానుమతి. ఆ సినిమా లేకుండానే సినిమా పూర్తయింది. ఈ సినిమాలో భానుమతికి పారితోషికం రూ.20వేల కంటే ఎక్కువగానే ఇచ్చారట. అప్పుడు అన్న ఎన్టీఆర్ కి రూ.12వేలు ఇచ్చి సరిపెట్టారట. వాస్తవానికి అప్పట్లో నెలవారి జీతాలుగా హీరో, హీరోయిన్లు చేసేవారు. భానుమతి మాత్రం నెల జీతానికి చేసేది కాదట. ఈ విషయంలో ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట. భానుమతి కంటే నేను ఏం తక్కువ అంటూ ప్రశ్నించారట.  

Advertisement

Also Read :   సౌంద‌ర్య ముఖం పై కాలు పెట్ట‌న‌ని ఏడ్చేసిన ర‌మ్య‌కృష్ణ‌…ఆ సీన్ వెన‌క ఇంత క‌థ జ‌రిగిందా..?

ఈ చిత్రంలో భానుమతి ఉంది కాబట్టే తీస్తున్నారని, సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని దర్శకుడు ఎన్టీఆర్ కి నచ్చజెప్పి ఎన్టీఆర్ తో నటించేవిధంగా చేశాడట. ఎన్టీఆర్ కి భానుమతి అంటే చాలా గౌరవం ఉండేది. అన్నగారితో చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. ఆ తరువాత నందమూరి బాలయ్యతో కొన్ని సినిమాల్లో నటించింది భానుమతి. అయితే మల్లీశ్వరి సినిమాలో భానుమతి తీసుకునేందుకు ఎన్టీఆర్ ఓ కండీషన్ పెట్టారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో భానుమతి వచ్చిన సమయంలో ముందుగా బాలయ్య వెళ్లి కారు డోర్ తీసి ఆమెను సెట్స్ లోకి తీసుకురావాలని కోరారు. తన కుమారుడు అలా చేయడం ఒక మర్యాదపూర్వకంగా భావించేవారు. ఎన్టీఆర్  అంతలా భానుమతిని గౌరవించే వారు. అదేవిధంగా చాలా విషయాల్లో వీరు ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారు. 

Advertisement

Also Read :   బిగ్ బాస్ నుంచి బాలాదిత్య ఎలిమినేట్ కావడానికి ఇదే కారణమా ?