Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » నాలుగు రోజులకే ఆ సినిమాను ఎత్తేశారు.. జగపతి బాబు కామెంట్స్ వైరల్..!

నాలుగు రోజులకే ఆ సినిమాను ఎత్తేశారు.. జగపతి బాబు కామెంట్స్ వైరల్..!

by Anji
Ads

టాలీవుడ్ ప్రముఖ నటులల్లో ఒకరైన జగపతి బాబు నటించిన రుద్రంగి సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమా రిజల్ట్ గురించి జగపతి బాబు మాట్లాడుతూ.. ఈ మూవీ కథ నచ్చడంతో రెమ్యునరేషన్ కూడా తగ్గించుకొని ఈ సినిమా కోసం పని చేసినట్టు తెలిపారు. ఈ చిత్రానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మాత కాగా.. ఆయన నిర్మాత అయిన సినిమా ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదని జగపతి బాబు తెలిపారు.

Advertisement

Ad

బాగా రావాలనే తపన వాళ్ళలో నాకు కనిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రీజన్ వల్ల నాలుగు రోజుల్లోనే రుద్రంగి మూవీని థియేటర్ల నుంచి తీసేశారని ఆయన అన్నారు. అలా చేయడం వల్ల నా మూవీ దిక్కులేని అనాధ అయిందని జగపతి బాబు చెప్పుకొచ్చారు. 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తీశారని నా రేంజ్ మూవీ కాకపోయినా.. నేను చేశానని ఆయన సంచలన కామెంట్లు చేశారు. ఈ సినిమాను డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని నేను సూచనలు చేశానని.. అయితే నా సూచనలను వాళ్ళు ఎవరు పట్టించుకోలేదని జగపతి బాబు తెలిపారు.

Advertisement

ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా రుద్రంగి నా కెరియర్ లో బెస్ట్ మూవీ అని జగపతి బాబు ఆసక్తికర కామెంట్లు చేశారు. జగపతి బాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.  ఈ కామెంట్లపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. జగపతిబాబు ప్రస్తుతం సలాడ్ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాతో పాటు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టు లు ఆయన చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. జగపతిబాబు రెమ్యూనరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. జగపతిబాబుకు తర్వాత సినిమాలతో సైతం భారీ స్థాయిలో విజయాలు దక్కాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. జగపతిబాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 జక్కన్న నుంచి బిగ్ అనౌన్స్ మెంట్.. ఎవ్వరూ ఊహించని విధంగా..!

మహమ్మద్ సిరాజ్ పై శ్రద్ధాకపూర్‌ సీరియస్.. ఎందుకు ఇలా చేశావంటూ ?

Visitors Are Also Reading