Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » మహమ్మద్ సిరాజ్ పై శ్రద్ధాకపూర్‌ సీరియస్.. ఎందుకు ఇలా చేశావంటూ ?

మహమ్మద్ సిరాజ్ పై శ్రద్ధాకపూర్‌ సీరియస్.. ఎందుకు ఇలా చేశావంటూ ?

by Bunty
Ads

ఆదివారం సంచలన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హైదరాబాది పెసర్ మీద ఆరోపణలా..? అది కూడా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నుంచి అని ఆశ్చర్యపోతున్నారు. మొన్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో కొత్త బంతితో మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఒకటే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టడం సహా మొత్తం మీద ఆరు వికెట్లు తీశాడు.

Advertisement

Actress Shraddha Kapoor shares a hilarious message for Mohammed Siraj

Actress Shraddha Kapoor shares a hilarious message for Mohammed Siraj

దెబ్బకు శ్రీలంక 50 పరుగుల అత్యంత తక్కువ స్కోర్ కే ఇంటి బాటపట్టింది. మన ఓపెనర్లు పెద్దగా కష్టపడకుండానే పనిని కానిచ్చెశారు. కనీసం 8-9 గంటలు జరగాల్సిన మ్యాచ్ కేవలం 2:30 గంటల్లోనే మ్యాచ్ పూర్తయింది. దీని గురించే శ్రద్ధ కపూర్ కంప్లైంట్ చేసింది. కాస్త ఫన్నీగా సిరాజ్ ను పొగుడుతూ… దీర్ఘంగా ఆలోచిస్తున్న ఫోటోను ఇన స్టా స్టోరీలో పోస్ట్ చేసింది.

Ad

Advertisement

దానికి క్యాప్షన్ ని కూడా జత చేసింది. ఇప్పుడు సిరాజ్ నే అడగాలి. ఈ ఫ్రీ టైం లో ఏం చేయాలో, నిజమే కదా శ్రద్ధాకపూర్ మాత్రమే కాదు దేశం అంతా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. అసలే ఆదివారం సాయంత్రం కావడం, అందరూ టీవీలకు అతుక్కుపోయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని భావిస్తే… సిరాజ్ దెబ్బకు 2:30 గంటల్లోనే మ్యాచ్ ముగిసింది. దీంతో శ్రద్ధ కపూర్..  సిరాజ్ పై క్యూట్ కంప్లైంట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading