Home » పీఎఫ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం.. జమఅయ్యేది ఎప్పుడో తెలుసా ?

పీఎఫ్ వడ్డీ రేటును ప్రకటించిన కేంద్రం.. జమఅయ్యేది ఎప్పుడో తెలుసా ?

by Anji
Ad

ప్రతీ ఉద్యోగికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉంటుంది. దానిలోకి మన సాలరీ నుంచి ఎంత మొత్తం కట్ అవుతుంది ? దానిపై వచ్చే వడ్డీ ఎంత? ఆ వడ్డీని ఎలా లక్కిస్తారు. ఎప్పుడు ఖాతాలో జమ అవుతుందనే అంశాలు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. ఎప్పుడో ఖాతాలో జమా అవుతుందనే అంశాలు పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. ఎప్పుడో ఆరు నెలలకు.. ఏడాదికి ఒకసారి పాస్ బుక్ చెక్ చేసుకుంటారు.

Advertisement

ఇటీవలే కేంద్రం ఈపీఎఫ్ పై వడ్డీ రేటును ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద 8.15 శాతం వడ్డీని ఖాతాదారులకు అందించేందుకు ఆమోదం తెలిపింది. ఇటీవలే జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం..ఈపీఎఫ్ఓ 2022-23 కోసం 8.15వడ్డీని సభ్యుల ఖాతాల్లోకి జమ చేయాలని ఆయా కార్యాలయాలకు ఆదేశించింది. ఈ మొత్తం ఖాతాల్లో ఎప్పుడూ జమ అవుతుంది బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. 

Advertisement

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్య నిధి పథకం కోసం 8.15 వడ్డీ రేటును ఆమోదించింది. 2022-23 ఏడాదికి ఈపీఎఫ్ స్కీమ్ లోని ప్రతీ సభ్యుడు సంవత్సరానికి 8.15 శాతం వడ్డీని అందుకుంటారని నిర్దారిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత వడ్డీరేటు అధికారికంగా ప్రభుత్వ గెజిట్ లో తెలియజేస్తుంది. ఆ తరువాత చందాదారుల ఖాతాల్లోకి వడ్డీని జమ చేస్తారు. నెలవారి సభ్యుల నుంచి తీసుకున్న మొత్తం వడ్డీని లెక్కిస్తారు. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటు నెలవారి ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేయబడుతాయి. బదిలీ చేయబడిన వడ్డీ తదుపరి నెల బ్యాలెన్స్ కి జోడించబడుతుంది. ఆ వడ్డీతో కలిపి నెల బ్యాలెన్స్ మొత్తం పై మళ్లీ వడ్డీని లెక్కిస్తారు. ఈ ఏడాది ముగింపులో ఏడాదికి సంబంధించిన మొత్తం వడ్డీని జమ చేస్తారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

నిద్ర లేవగానే వేటిని చూస్తే మంచిదో తెలుసా…వీటిని చూస్తే దరిద్రమే !

ఎనర్జీ డ్రింక్ ని ఎక్కువగా తాగుతున్నారా..? అయితే ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి..!

Visitors Are Also Reading