Telugu News » Blog » అజిత్ తునివు‌కు తెలుగు టైటిల్‌ ఇదే.. థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే ?

అజిత్ తునివు‌కు తెలుగు టైటిల్‌ ఇదే.. థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే ?

by Anji

తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఈయన మాస్ హీరోగా, అభిమానులు అలరించే సినిమాలను చేస్తూ బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అజిత్ హీరోగా వస్తున్న తాజా చిత్రం తునివు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాకు తెలుగులో ఇంట్రెస్టింగ్ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది. తునివు తెలుగులో కూడా ఇదే టైటిల్ తో  విడుదల కానుందని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. 

Advertisement

కానీ ఈ సినిమాకు తెలుగులో “తెగింపు “అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు..  ఈ సినిమాకు తెలుగులో మూడు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మంజు వారియర్ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. తమిళనాడులో భారీగా రిలీజ్ కానుండగా తెలుగులో మాత్రం పెద్దగా బజ్ మాత్రం లేదు. గతంలో అజిత్ వలిమై చిత్రాన్ని కూడా తెలుగులో బలం అని మొదట ప్రకటించారు. కానీ తెలుగులో కూడా తమిళ పేరు అయినటువంటి వలిమై అనే రిలీజ్ చేయడం విశేషం. 

Advertisement

Also Read :  అల్లు అరవింద్ లేకుంటే చిరంజీవి లేడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

Manam News

ఈ  చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ , బేవ్యూ ప్రాజెక్ట్స్ పతాకంపై బోనీకపూర్ సంయుక్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో అజిత్ కు జోడిగా హిందీ భామ హ్యూమా ఖురేషి నటించారు. అజిత్ పర్సనల్ విషయానికొస్తే..  ప్రముఖ నటి శాలినిని  2000లో వివాహం చేసుకున్నారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు.  అందరి హీరోలా మాదిరిగా  కాకుండా జుట్టు మొత్తం తెల్లబడిన ఏమాత్రం రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తారు అజిత్. 

Also Read :  ట్రోలర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీతారామం బ్యూటీ.. ఎందుకో తెలుసా ?