Home » అల్లు అరవింద్ లేకుంటే చిరంజీవి లేడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

అల్లు అరవింద్ లేకుంటే చిరంజీవి లేడు.. షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. ఆయన హీరోగా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించారు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అనేక మూవీస్ చేశారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చంద్రమోహన్ నటన అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.. అలాంటి చంద్రమోహన్ ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి ప్రాణం పోసి నటిస్తారు.. ఈ మధ్యకాలంలో వయసు మీద పడడంతో కాస్త సినిమాలకు దూరమయ్యాడు. కానీ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాడు..

Advertisement

also read:పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయికి మంగళ స్నానం ఎందుకు చేయిస్తారంటే..?

అలాంటి చంద్రమోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. తెలుగు తెరపై చంద్రమోహన్ మరియు చిరంజీవి కాంబోలో అనేక సినిమాలు విడుదలై విజయవంతమయ్యాయి. వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.. తాజాగా చంద్రమోహన్ చిరంజీవిపై చేసిన కొన్ని కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.. అవేంటయ్యా అంటే.. అల్లు అరవింద్ అనే వ్యక్తి లేకుంటే చిరంజీవి లేడు అన్నట్లు ఆయన మాట్లాడారు.. దీంతో మెగా అభిమానులు మండిపడుతున్నారు..

Advertisement

కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని ఎలా గైడ్ చేశారో అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ చిరంజీవిని ఆ విధంగానే గైడ్ చేశారని తెలియజేశారు.. అల్లు అరవింద్ చిరంజీవి ఏ క్యారెక్టర్ చేయాలి ఎంత పారితోషకం తీసుకోవాలి. ఇలా చిరంజీవి ప్రతి విషయంలో ఆయన దగ్గరుండి గైడ్ చేశారు కాబట్టే ఇప్పుడు ఆ పొజిషన్లోకి వచ్చారు అన్న విధంగా మాట్లాడారు.. అలాంటి వ్యక్తులు నా జీవితంలో కూడా ఉంటే బాగుండేది అని అన్నారు చంద్రమోహన్.. ఈ విధమైన కామెంట్స్ చేయడంతో చిరంజీవి అభిమానులకు కాస్త కోపం వచ్చినట్టు తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading