Home » తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఉద్యోగాలు… జీతం రూ.24 వేలు.. వివరాలు ఇవే

తెలంగాణ చేనేత, జౌళి శాఖ ఉద్యోగాలు… జీతం రూ.24 వేలు.. వివరాలు ఇవే

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయం పలు పోస్టులను భర్తీ చేస్తుంది.

Advertisement

ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఇక దీనికోసం పూర్తి వివరాలను చూస్తే, ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ లోని తెలంగాణ చేనేత, జౌళీ శాఖ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపాదికన 15 క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. అలానే చేనేత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. అలానే ఎమ్మెస్ వర్డ్/ఎక్సెల్/పవర్ పాయింట్ వచ్చి ఉండాలి.

Advertisement

నోటిఫికేషన్ లో వెలువడిన 21 రోజుల్లోపు ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. కింది అడ్రస్ కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ లోకి వెళితే, విద్యార్హతలు, అనుభవం, స్థానికత, వయోపరిమితి చూసి ఎంపిక చేస్తారు. సాలరీ విషయానికి వస్తే నెలకు రూ. 24 వేల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చూడవచ్చు.

దరఖాస్తు చిరునామా :
The Commissioner of Handlooms & Textiles & AEPs, 3rd Floor, Chenetha Bhavan, Nampally, Hyderabad-500001, Telangana State.

READ ALSO : చనిపోయే ముందు నటుడు రంగనాథ్ గోడపై ఏమని రాసారో తెలిస్తే… కన్నీళ్లు ఆగవు!

Visitors Are Also Reading