తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య వరుస నోటీఫికేషన్లను రిలీజ్ చేస్తుంది. ఇటీవల గ్రూపు 1, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారికి ఈవెంట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెలలో దేహదారుడ్య పరీక్షలు ముగుస్తాయి.
దేహ దారుడ్య పరీక్షలలో క్వాలిఫై అయి మెయిన్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఓ కీలక ప్రకటన చేసింది. అది ఏంటంటే.. మార్చి 12, 2023 నుంచి తుది పరీక్షలుంటాయని టీఎస్ఎల్పీఆర్బీ ప్రకనటించింది. ఏప్రిల్ 09న సివిల్ ఎస్సై మెయిన్స్, ఏప్రిల్ 23న అన్ని రకాల కానిస్టేబుల్ పోస్టులకు తుది పరీక్షలుంటాయని పేర్కొంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల అధికారిక వెబ్ సైట్ ని వీక్షించాలని సూచించింది.
Also Read : ఉదయ్ కిరణ్ సోదరి టాలీవుడ్ టాప్ సింగర్ అన్న సంగతి తెలుసా..! ఆమె ఎవరంటే..?
మరోవైపు నియామక ప్రక్రియకు సంబంధించి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపడుతున్నారు. కేవలం ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం గ్రూపు 2, గ్రూపు 3, గ్రూపు4, స్టాప్ నర్సు, జూనియర్ లెక్చరర్స్ వంటి తదితర పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగులు రీడింగ్ రూమ్, కోచింగ్ సెంటర్లలో కుప్పలు కుప్పలుగా జాయిన్ అవుతూ బిజీగా ఉన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోండి.
Also Read : Hit 2 Movie OTT Release: అడివి శేష్ హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?