Home » Hit 2 Movie OTT Release: అడివి శేష్ హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? 

Hit 2 Movie OTT Release: అడివి శేష్ హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..? 

by Anji
Ad

Hit 2 Movie OTT Release: టాలీవుడ్ యంగ్ హీరోలలో అడివి శేష్ ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే హిట్ 2 సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. తనకు అచ్చొచ్చినటువంటి థ్రిల్లర్ జోనర్ లో నే ఎక్కువగా సినిమాలు చేస్తూ.. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. 

Hit 2 Movie OTT Release

Advertisement

ఈ ఏడాది మేజర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ సాధించిన శేష్.. హిట్ 2 మూవీతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన హిట్ ది ఫస్ట్ కేస్ కి ఇది సీక్వెల్. ఫస్ట్ పార్ట్ ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను హిట్ 2 ని మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.

Hit 2 Movie OTT Release Date

నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని ఈ క్రై**మ్ థ్రిల్లర్ ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కథానాయికలుగా నటించారు. డిసెంబర్ 02న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్లన్ల వర్షం కురిపించింది. తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని మంచి లాభాల బాట పట్టింది. ఇప్పటికే ఈ చిత్రం థియేటర్లలో ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే హిట్ 2 సినిమా డిజిటల్ విడుదల కోసం ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిరీక్షణకు చెక్ పడే సమయం ఆసన్నమైంది. సంక్రాంతి కానుకగా అడివి శేష్ హిట్ 2 స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Also Read :  రూ.49తో రాత్రికి రాత్రి కోటీశ్వరుడు.. ఎలాగో తెలుసా ?

Hit 2 Movie OTT Release Hit 2 Movie Ott Plaform

 

హిట్ 2 సినిమా హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ పోటీ పడగా.. భారీ ధరకు అమెజాన్ సంస్థ దక్కించుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం.  ఈ చిత్రంలో రావు రమేష్, ఆదర్శ్ బాలకృష్ణ, సుహాస్ తదితర కీలక పాత్రలు పోషించారు. మరోవైపు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ హిట్ యూనివర్స్ థర్డ్ పార్డ్ కూడా రాబోతుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా ఇందులో నటించబోతున్నట్టు హిట్ 2 క్లైమాక్స్ లో రివీల్ చేసారు. ఇందులో అడివి శేష్ సైతం నటించనున్నాడట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా తమిళస్టార్ విజయ్ సేతుపతి కూడా నటించబోతన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే హిట్ 2 థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకాధరణ ఎలా ఉంటుందనేది సంక్రాంతి వరకు వేచి చూడాలి.

Also Read :  బాల‌య్య వీర సింహారెడ్డి సినిమాలో అదే హైలెట్..చూస్తే క‌న్నీళ్లు ఆగ‌వు..!

Visitors Are Also Reading