Home » రిషబ్ పంత్ స్థానంలో ఆరంగేట్రం చేయనున్న టీమిండియా స్టార్ ఓపెనర్ ?

రిషబ్ పంత్ స్థానంలో ఆరంగేట్రం చేయనున్న టీమిండియా స్టార్ ఓపెనర్ ?

by Anji
Ad

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తోంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. ఇక రెండో మ్యాచ్ లో టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కించుకున్నాడు. ఓపెనింగ్ లో ఇషాన్ కిషన్ తో కలిసి పంత్ బరిలోకి దిగాడు. అతను ప్రత్యేకంగా ఏమి చేయలేక కేవలం 46.15 స్ట్రైక్ రేట్ తో 13 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ కి చేరుకున్నాడు. దీంతో మూడో టీ20లో పంత్ స్థానంలో మరో ప్లేయర్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Advertisement

చివరి టీ20లో రిషబ్ పంత్ స్థానంలో శుభ్ మన్ గిల్ ని జట్టులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ మ్యాచ్ ద్వారా గిల్ అంతర్జాతీయ టీ20లో కూడా ఆరంగేట్రం చేసే అవకాశముంది. గిల్ ఇప్పటివరకు భారత్ తరుపున టెస్ట్ క్రికెట్, వన్డే మ్యాచ్ లు ఆడాడు. గిల్ పలు సందర్భాల్లో భారత జట్టు తరుపున టెస్ట్ మ్యాచ్ లు, వన్డే  క్రికెట్ ఆడాడు. చాలా సందర్భంలో గిల్ భారత జట్టు తరపున ఓపెనింగ్ చేశాడు. వన్డే క్రికెట్ ఓపెనర్ గా బరిలోకి దిగుతూ కనిపిస్తాడు. 

Advertisement

 

గిల్ ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్ తన సత్తా చాటేందుకు ప్రయత్నించవచ్చు. క్రికెట్ లో ఆడుతున్న గిల్ 12 మ్యాచ్ లలో 57.90 సగటుతో 579 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు మూడు అర్థ సెంచరీలు కూడా సాధించాడు. ఐపీఎల్ 2022లో 16 మ్యాచ్ లలో 34.50 సగటుతో 132.33 స్ట్రైక్ రేట్ తో 483 పరుగులు చేశాడు. టీ20 పరంగా అతని గణాంకాలు బాగున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిల్ టీ 20 అంతర్జాతీయ ఆరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది.  

Also Read :   ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలకృష్ణ అంటే తప్పు కాదా..?

మరోవైపు టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా కనిపించిన రిషబ్ పంత్ ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ లో అంతగా ఆకట్టుకోలేదు. పంత్ తన చివరి నాలుగు టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ లలో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఆప్రికా పై 27, జింబాబ్వే 3, ఇంగ్లండ్ పై 6, న్యూజిలాండ్ పై 6 ఉన్నాయి. పంత్ ఇప్పటివరకు మొత్తం 65 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. అందులో అతను 22.69 సగటు, 125.77 స్ట్రైక్ రేట్ తో 976 పరుగులు చేశాడు. 

Also Read :  దృశ్యం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

 

Visitors Are Also Reading