Home » ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలకృష్ణ అంటే తప్పు కాదా..?

ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలకృష్ణ అంటే తప్పు కాదా..?

by Anji
Ad

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి తారకరామారావు కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. కేవలం సినిమాల్లోనే రాజకీయాల్లో కూడా తన సత్తా ఏంటో చాటారు. ఎన్టీఆర్ తరువాత తన కుమారులు హరి కృష్ణ, బాల కృష్ణ సినిమాల్లో రాజకీయాల్లో రాణించారు. అనుకోకుండా హరి కృష్ణ ప్రమాదంలో మరణించారు. బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు. హరికృష్ణ కుమారులు అయినటువంటి నందమూరి తారకరామారావు, యంగ్ ఎన్టీఆర్ హీరోలుగా దూసుకెళ్తున్నారు. ఇక రాజకీయ పరంగా ఎన్టీఆర్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వానికి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. 

Advertisement

ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానిస్తారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి సేవలు చేశారని చెప్పాలి. ఇక అదేవిదంగా దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కూడా ఎంతో మంది గొప్పగా చెబుతుంటారు. వైసీపీ ప్రభుత్వం నందమూరి కుటుంబంపై తీవ్ర విమ ర్శలు చేసినప్పటికీ ఈ విమర్శలపై నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరూ టీడీపీ నేతలు. ఎన్టీఆర్ యూనివర్సిటీ విషయంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఓ గొప్ప వ్యక్తి అని చెప్పడంతో చాలా మంది ఎన్టీఆర్ పై విమర్శలు చేశారు. 

Advertisement

తాజాగా నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఉమ్మడీ ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఇందులో  బాల కృష్ణ  వైఎస్సార్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ తరుణంలోనే కొందరూ ఎన్టీఆర్ అభిమానులు ఒకప్పుడు ఎన్టీఆర్ వైఎస్సార్ గొప్పవారు అంటే ఆయనని తీవ్రస్థాయిలో దుర్భషలాడారు. ఇప్పుడు ఇదే మాట బాల కృష్ణ అంటున్నారు. బాలయ్య మాట్లాడిన మాటలు తప్పు కాదా అని.. ఎన్టీఆర్ విషయంలో లేచిన నోర్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు బాల కృష్ణని ఎదురించే దమ్ము లేదా అంటూ ఈ వ్యవహారంపై టీడీపీ నేతలను కొందరూ ప్రశ్నించడం గమనార్హం.  

Also Read :  సెట్ బ‌య‌ట నిలుచున్న చిరంజీవిని తిట్టిప‌డేసిన స్టార్ ప్రొడ్యూసర్.. ? ఆయ‌న ఎవ‌రంటే..?

Visitors Are Also Reading