Home » కోహ్లీ స్థానానికి సూర్య కుమార్ ఎసరు..?

కోహ్లీ స్థానానికి సూర్య కుమార్ ఎసరు..?

by Azhar
Ad

భారత జట్టులో విరాట్ కోహ్లీ పాత్ర ఎలా ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. అయితే కోహ్లీ ఓ సీనియర్ బ్యాటర్ గా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక అదే సమయం ఈ మధ్య భారత జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ కోహ్లీ స్థానానికి ఎసరు పెట్టాడు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఆసియా కప్ ఆడుతున్న టీం ఇండియా నిన్న హాంగ్ కాంగ్ ను ఓడించి సూపర్ 4కు వచ్చింది.

Advertisement

అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీతో పాటుగా సూర్య కుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీ అనేది చేసాడు. కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేయగా.. సూర్య కుమార్ యాదవ్ కేవలం 26 బంతుల్లో 68 పరుగులు చేసాడు. దాంతో కోహ్లీ కంటే సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో కొందరు సూర్య కుమార్ యాదవ్ కు ప్రమోషన్ ఇవ్వాలి అని కోరుతున్నారు.

Advertisement

అయితే ప్రస్తుతం టీం ఇండియాలో సూర్య కుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. కానీ గౌతమ్ గంభీర్ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లీని నాలుగో స్థానంలో దింపి ఫామ్ లో సూర్య కుమార్ యాదవ్ ను మూడో స్థానంలో బ్యాటింగ్ పంపించాలని బీసీసీఐకి సూచిస్తున్నారు. ఈ వాదన కు అభిమానుల నుండి కూడా మద్దతు అనేది భారీగానే వస్తుంది.

ఇవి కూడా చదవండి :

తనపై వస్తున్న పుకార్ల మీద జడేజా స్పందన..!

పాండ్య కెప్టెన్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading