Telugu News » Blog » బాహుబలి రేంజ్ లో ‘సూర్య 42’.. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

బాహుబలి రేంజ్ లో ‘సూర్య 42’.. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

by Anji
Ads

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమాటకామాట ఏది ఏమైనా కరోనా మహమ్మారి తరువాత సినిమా ఇండస్ట్రీలో భాష బేదాలు తగ్గాయనే చెప్పాలి. కంటెంట్ త పని లేకుండా ఏ భాష సినిమా అయినా చూసేస్తున్నారు మూవీ లవర్స్. కొన్ని సినిమాలను పాన్ ఇండియాను దృష్టిలో పెట్టుకొని  భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంటే.. మరికొన్ని సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ హిట్ అందుకున్నాయి. ఆ తరువాత మిగిలిన భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అందరూ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.  

Advertisement

Also Read :  అరుణాచలం మూవీలో బామ్మ పాత్ర చేసిన నటి మీకు గుర్తుందా..?

టాలీవుడ్ లో బాహుబలి సినిమాల తరువాత పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ మొదలైందనే చెప్పవచ్చు. అంతగా ఈ సినిమా దేశవ్యాప్తంగా సక్సెస్ ని అందుకుంది. ఈ చిత్రం తరువాత పలు పాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల్లో వస్తున్నాయి. తాజాగా తమిళ స్టార్ నటుడు సూర్య ఓ పాన్ ఇండియా సినిమా చేసేందుకు సిద్దమయ్యారు. తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో సూర్య 42 మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

Also Read :  కాస్త త‌గ్గిన ర‌ష్మిక‌…ఆ క్రెడిట్ మాజీ ప్రియుడిదే అంటూ ఓపెన్ కామెంట్స్..!

Advertisement

Manam News

‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ వంటి సినిమాల తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ మూవీలో సూర్య ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారని, 16 వ శతాబ్దానికి చెందిన ఓ కథాంశంతో మూవీ తెరకెక్కనుందని చెప్పారు. బడ్జెట్ విషయంలో సూర్య ఇప్పటి వరకూ నటించిన సినిమాల బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువగానే ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ కన్నడ నుంచి ‘కేజీఎఫ్’ సినిమాలు చూసారని, ఇప్పుడు సూర్య వంతు వచ్చిందని వెల్లడించారు. ఆ సినిమాల స్థాయికి ‘సూర్య 42’ ఏ మాత్రం తగ్గదన్నారు.  ఎందుకంటే ఈ సినిమా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. 

Also Read :  సమంత చైతు విడాకులకు కారణం నాగార్జునే.. షాకింగ్ నిజాలు చెప్పిన శ్రీరెడ్డి..!!

Producer Gnanavel Raja summoned in ₹300 crore money laundering case: report  - Hindustan Times

వాస్తవానికి నటుడు సూర్య కు తమిళ్ తో పాటు ఇతర భాషల్లో కూడా  మంచి గుర్తింపు ఉంది. ఆయన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతుంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన నటించిన ‘జైభీమ్’, ‘విక్రమ్’ సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దీంతో సూర్య పాన్ ఇండియా బాగానే వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ చిత్రాన్ని 10 భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్స్  కూడా భారీ స్థాయిలో చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తమిళ్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ‘కేజీఎఫ్’ ల తరహా లో ఉంటుదని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా ఏరేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి. 

Advertisement

Also Read :  NTR 30 : అప్పుడు తాత.. ఇప్పుడు మనవడు.. అస్సలు తగ్గట్లేదుగా…!

You may also like