Home » కాస్త త‌గ్గిన ర‌ష్మిక‌…ఆ క్రెడిట్ మాజీ ప్రియుడిదే అంటూ ఓపెన్ కామెంట్స్..!

కాస్త త‌గ్గిన ర‌ష్మిక‌…ఆ క్రెడిట్ మాజీ ప్రియుడిదే అంటూ ఓపెన్ కామెంట్స్..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లుగా బిజీగా ఉన్న భామ‌ల్లో ర‌ష్మిక కూడా ఒక‌రు. ఛ‌లో సినిమాతో ర‌ష్మిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమానే సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటూ ఆ త‌ర‌వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన గీతాగోవిందం సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఇక గీతాగోవిందం త‌ర‌వాత ర‌ష్మిక కెరీర్ లో తిరిగి వెన‌క్కి చూసుకోలేదు. వ‌రుస సినిమాలతో ఇండ‌స్ట్రీలో బిజీగా మారిపోయింది.

ALSO READ : సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!

Advertisement

కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళ హిందీ సినిమాల‌లోనూ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే ర‌ష్మిక మొట్ట‌మొద‌ట కిరిక్ పార్టీ అనే క‌న్న‌డ చిత్రం ద్వారా సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఈ సినిమాలో ర‌క్షిత్ శెట్టి హీరోగా న‌టించ‌డంతో పాటూ త‌న సొంత బ్యాన‌ర్ లో నిర్మించారు. కాగా ఈ సినిమా స‌మ‌యంలోనే ర‌ష్మిక ర‌క్షిత్ శెట్టి ప్రేమ‌లో ప‌డ్డారు. వీరికి ఎంగేజ్మెంట్ కూడా జ‌రిగింది.

Advertisement

కానీ ఆ త‌ర‌వాత ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక మాట్లాడుతూ త‌న‌కు మొద‌టిసారి సో కాల్డ్ బ్యాన‌ర్ నుండి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని సైగ‌లు చేస్తూ చూపించింది. దాంతో ఆమెపై క‌న్న‌డ ప్రేక్ష‌కులు భ‌గ్గుమ‌న్నారు. కాగా ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ష్మిక త‌న మాజీ ప్రియుడి బ్యాన‌ర్ పేరును చెప్పింది.

దాంతో ర‌ష్మిక కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. తను మొద‌ట మొడ‌లింగ్ చేశాన‌ని చెప్పింది. ఓ అందాల పోటీలో పాల్గొన‌గా త‌న ఫోటో అన్ని ప‌త్రిక‌ల‌లో వ‌చ్చింద‌ని చెప్పింది. ఆ ఫోటో చూసి త‌న‌కు ప‌రంవా స్టూడియోస్ బ్యాన‌ర్ వాళ్లు ఫోన్ చేశార‌ని చెప్పింది. అలా త‌నకు మొద‌టి సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని తెలిపింది.

ALSO READ :సాయి ధరమ్ తేజ్ పై సంయుక్త మీనన్ సీరియస్ !

Visitors Are Also Reading