Telugu News » Blog » అరుణాచలం మూవీలో బామ్మ పాత్ర చేసిన నటి మీకు గుర్తుందా..?

అరుణాచలం మూవీలో బామ్మ పాత్ర చేసిన నటి మీకు గుర్తుందా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

రజనీకాంత్ హీరోగా వచ్చిన అరుణాచలం అప్పట్లో ఎంతటి సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా హీరో రజినీకాంత్ కు బామ్మ పాత్రలో చేసిన నటి చాలా ఫేమస్ అయింది.. మరి ఆ నటి ఎవరో ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసుకుందాం.. అరుణాచలం మూవీ లో బామ్మ పాత్ర చేసిన నటి పేరు వడివుక్కరాసి.ఈమె తమిళంలో ఎంతో పాపులర్ నటిమణి. తెలుగులో కూడా చాలా డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైంది.

Advertisement

also read:కొత్త ఇంట్లో అడుగుపెట్టిన చైతూ…ఫ‌స్ట్ గెస్ట్ ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

also read:అక్కినేని సుమంత్ కీర్తిరెడ్డి కి విడాకులు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా…?

ఈమె తన వయసు కంటే పెద్ద పాత్రలు చేస్తూ మంచి గుర్తింపును సాధించింది. తన సినీ కెరియర్ మొత్తంలో 350 పైగా చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ఇక రజనీకాంత్ కంటే ఎనిమిదేళ్లు చిన్న వయసు అయినప్పటికీ అరుణాచలం మూవీలో బామ్మ పాత్ర చేసి ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా నటించడం కాదు జీవించింది అని చెప్పవచ్చు. ఈ అరుణాచలం చిత్రం విషయంకి వస్తే ఆమె నటన మరో లెవెల్.. ఈ చిత్రంలో ఆమె వీపుపై పెద్ద మూఠ ఉన్నట్టుగా కనిపిస్తుంది.

Advertisement

ఆమె రజనీకాంత్ కంటే చిన్న వయసు అయినా కానీ ఆ ప్రభావం ఎక్కడ కనిపించకుండా మేనేజ్ చేసింది. ఇక ఈ సినిమా మొత్తం షూటింగ్లో ఆమె గూని తో చేతి కర్ర పట్టుకొని ఉండాలి.. ఇక ఇందులో ముఖ్యంగా ఆమె చేతి కర్ర పట్టుకొని వంగి మెట్లు దిగుతూ రజినీకాంత్ ని రేయ్ అరుణాచలం ఎవరి ఆస్తి ఎవర్రా పంచేది అంటూ డైలాగ్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.. ఇలా సినిమా మొత్తం ఆమె వంగిపోయినట్లుగా నటించడం మామూలు విషయం కాదు.. ఇలా కష్టపడుతూ సింగిల్ షాట్ లోనే షూటింగ్ అంతా పూర్తి చేసిందట. దీంతో షూటింగ్ తర్వాత రజనీకాంత్ ఆమెను గట్టిగా హాత్తుకొని గ్రేట్ అంటూ బదులిచ్చారట..

Advertisement

also read:ఆసీస్ మూడో వన్డేలో టీమిండియా ఘోర ఓటమికి 5 ప్రధాన కారణాలు

You may also like