Home » 10 రూపాయలకే సూపర్ స్పెషాలిటీ వైద్యం.. ఎక్కడో తెలుసా ?

10 రూపాయలకే సూపర్ స్పెషాలిటీ వైద్యం.. ఎక్కడో తెలుసా ?

by Anji

సాధారణంగా ఏ చిన్న వ్యాధి వచ్చిన ప్రజలు.. ఆసుపత్రికి పరుగులు పెడుతుంటారు. వైద్యం మరింత ప్రియంగా మారిన వేళ.. ప్రైవేటులో లక్షల రూపాయలు వెచ్చించి చికిత్స పొందుతున్నారు. నాడీ పట్టకుండానే రూ.500 నుంచి రూ.1500 వరకు కన్సల్టేషన్ ఫీజు కింద వసూలు చేస్తుంటాయి ప్రైవేటు ఆసుపత్రులు. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో మాత్రం కేవలం రూ.10కే వైద్యం చేస్తున్నారు డాక్టర్లు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఏమాత్రం తీసిపోని విధంగానే ఉండే ఆ ఆసుపత్రిలో అందరూ వైద్యులు తక్కువ ధరకే వైద్యం చేస్తున్నారు. 

కర్ణాటక రాష్ట్రంలోని పుత్తూరులో ఆదర్శ్ ఆసుపత్రి వైద్యులు గొప్ప మనస్సు చాటుకుంటున్నారు. ఇక్కడ మూడు అంతస్తుల ఆసుపత్రి ఉంది. నిత్యం వేలాది బాధితులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇక్కడ వైద్యులకు కన్సల్టేషన్ ఫీజు కేవలం రూ.10 మాత్రమే అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అదే ఈ ఆదర్శ్ ఆసుపత్రి ప్రత్యేకత. సీనియర్ వైద్యులు డాక్టర్ ఎం.కే.ప్రసాద్ ఈ ఆసుపత్రిని ఫౌండర్. ఇక్కడ అన్ని రకాల వైద్య సదుపాయాలు లభిస్తాయి. ఏ డాక్టర్ ను సంప్రదించాలన్నా ఫీజు మాత్రం 10 రూపాయలు మాత్రమే.. దీంతో పుత్తూరు చుట్టూ పక్కల ప్రజలు నిత్యం ఆసుపత్రికి క్యూ కడుతుంటారు.

 

పుత్తూరు చుట్టు పక్కల ప్రజలకు డాక్టర్ ఎం.కే.ప్రసాద్ అంటే ఎనలేని గౌరవం. సీనియర్ డాక్టర్ ఎం.కే.ప్రసాద్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత చాలా సంవత్సరాలు ప్రభుత్వ వైద్యుడిగా పని చేసిన ఎంకే ప్రసాద్ బాగా డబ్బు సంపాదించి ఈ ఆసుపత్రి నిర్మించారనుకుంటే పొరపాటే. డాక్టర్ ప్రసాద్ లక్షల రూపాయలు అప్పుచేసి ఈ ఆసుపత్రిని నిర్మించారు. పేదలకు సేవ చేయాలన్నా ఉద్దేశంతో రూ.10కే వైద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు డాక్టర్ ప్రసాద్. 

 

Visitors Are Also Reading