Home » ఒకే ఓవర్ లో 5 సిక్సులు బాదిన సన్ రైజర్స్ ఆటగాడు..!

ఒకే ఓవర్ లో 5 సిక్సులు బాదిన సన్ రైజర్స్ ఆటగాడు..!

by Anji
Ad

ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ హ్యారీ బ్రూక్ మరోసారి అద్భుతమైన ఫామ్ లో కనిపించాడు. ఈసారి ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు బాదాడు. హామిల్టన్ లోని సెడాన్ పార్కులో న్యూజిలాండ్ XI తో జరుగుతున్న రెండు రోజు వార్మప్ మ్యాచ్ లో అతను ఈ ఫీట్ సాధించాడు. బ్రూక్ భారత సంతతికి చెందిన ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ ని లక్ష్యంగా చేసుకొని ఒకదాని తరువాత ఒకటిగా 5 సిక్సర్లు బాదాడు. బ్రూక్ ఈ సిక్స్ ల వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. 

Advertisement

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో బ్రూక్ తన మొదటి సిక్స్ ని ఆన్ సైడ్ వైపు కొట్టడాన్ని మీరు చూడవచ్చు. ఆ తరువాత అతను బ్యాక్ పుట్ పై వెళ్లి లెగ్ సైడ్ వైపు రెండో సిక్స్ కొట్టాడు. ఇక ఆ తరువాత మరోసారి ధీటుగా బ్యాట్ ఝులిపించి మూడో సిక్స్ బాదాడు. మరోసారి బ్యాట్ ఝుళిపించి మూడో సిక్స్ బాదాడు. మరోసారి బ్యాక్ పుట్ పై వెళ్లి నాలుగో సిక్స్ కొట్టాడు. అదేసమయంలో అతను చివరి సిక్స్ కోసం స్టెప్స్ ఉపయోగించాడు. 55 బంతుల్లో వరుసగా 5 సిక్సర్లు కొట్టే ముందు 56 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో బ్రూక్ తన సెంచరీని కోల్పోయాడు. 71 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 97 పరుగులు మాత్రమే చేశాడు. ఇక అతని స్టైక్ రేట్ 136.62గా ఉంది. బ్రూక్ ని ఫాస్ట్ బౌలర్ జార్రోడ్ మెక్ కె బాధితుడిగా చేసాడు. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 465 పరుగులు చేసింది. 

Advertisement

బ్రూక్ ఈ ఇన్నింగ్స్ చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ లో సంతోషం వెల్లివిరిసింది. ఐపీఎల్ 2023 కోసం జరిగిన మినివేలంలో హైదరాబాద్ బ్రూక్ ని రూ.13.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇంతకుముందు కూడా ఇలాంటి కొన్ని ఇన్నింగ్స్ క్రీడాభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ముఖ్యంగా రావల్పిండిలో పాకిస్తాన్ తో ఆడుతున్న సమయంలో మొదటి టెస్ట్ సెంచరీని సాధించాడు. 80 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశారు. ఇప్పటి వరకు బ్రూక్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 6 ఇన్నింగ్స్ లలో 80 సగటుతో 480 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. 

Also Read :  ఒంటి చేతితో గాలిలో అద్భుత ఫీట్ సాధించిన కీలక ఆటగాడు.. అదిరిపోయిందంటున్న అభిమానులు..!

Visitors Are Also Reading