Home » ఒంటి చేతితో గాలిలో అద్భుత ఫీట్ సాధించిన కీలక ఆటగాడు.. అదిరిపోయిందంటున్న అభిమానులు..!

ఒంటి చేతితో గాలిలో అద్భుత ఫీట్ సాధించిన కీలక ఆటగాడు.. అదిరిపోయిందంటున్న అభిమానులు..!

by Anji
Ad

సౌత్ ఆఫ్రికా టీ-20 లీగ్ లో ఎంఐ కేఫ్ టౌన్ వర్సెస్ జోబర్గ్ సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది.అయితే.. ఈ గేమ్ లో హార్దిక్ పాండ్యా టీమ్ మెట్ అద్భుతమైన క్యాచ్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాచ్ కోసం గాలిలో చేసిన స్టంట్స్ మాత్రం నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. 

Advertisement

ఈ సిరీస్ లో ఎంఐ కేప్ టౌన్ కి రషీద్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇతను క్యాచ్ తీసుకున్న వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇక ఈ వీడియోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తూ.. ఐపీఎల్ కి ముందు ప్రాక్టీస్ అదిరిపోయిందంటున్నారు. ఐపీఎల్ లో రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. రషీద్ ఖాన్ క్యాచింగ్ వెబ్స్ అనే క్యాప్షన్ తో ఈ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు. 

Also Read :   ధావన్ కెరీర్ నాశనం చేస్తున్న మాజీ భార్య…వాటిని లీక్ చేస్తానంటూ బెదిరింపులు !

స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ కి ఈ క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టమైంది. ఎందుకు అంటే బంతి చాలా తక్కువ ఎత్తులో ఉంది. ఈ క్యాచ్ పట్టుకునేందుకు గాలిలోకి ఎగిరి ఒంటి చేతితో బాడీని బ్యాలెన్స్ చేస్తూ.. అందుకున్నాడు. అప్గనిస్తాన్ వెటరన్ స్పిన్నర్ ఈ బంతిని భూమికి కొన్ని అంగుళాల ఎత్తులో ఒడిసి పట్టుకున్నాడు. ఇక ఈ సమయంలో నేలకు చేయి తగలకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. అద్భుతమైన క్యాచ్ పట్టినప్పటికీ అతడి జట్టు మాత్రం భారీ ఓటమిని ఎదుర్కొంది. 

Also Read :  మెగాస్టార్ భోళా శంకర్ నుంచి ఆసక్తికరమైన అప్డేట్ మీకోసం..!

Visitors Are Also Reading