Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

by Bunty
Ads

సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కొని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నా మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ మార్చి మూడవ తేదీన రాత్రి ఫిలిం నగర్ లో 8:30 సమయంలో మంచు లక్ష్మీ నివాసంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక పెళ్లి తర్వాత మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

Advertisement

READ ALSO :  12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్

Ad

ఇది ఇలా ఉంటే పెళ్లి సమయంలో మంచు మనోజ్ మౌనిక ఇద్దరూ కూడా ఎమోషనల్ అయ్యారు. సాధారణంగా తాళి కట్టే సమయంలో, జీలకర్ర బెల్లం సమయంలో ఆడపిల్లలు ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. కానీ మంచు మనోజ్ మౌనికలు జీలకర్ర బెల్లం పెడుతూ కంటి చాటున దాగి ఉన్న ఎమోషన్ ను దాచుకోలేకపోయారు. ఎంతో కాలంగా ఎదురుచూసిన క్షణం రావడంతో ఆనందంతో ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Advertisement

READ ALSO : భూమా మౌలిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా… మనోజ్ కంటే ఎక్కువైనా?

అటు మౌనిక కూడా మోహన్ బాబును పట్టుకొని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఈ కొత్త జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మనోజ్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. జీవితంలో ఏదైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమ ఓడిపోకూడదు అన్నారు. ఎప్పటికీ ప్రేమే గెలవాలన్నారు. తమ ప్రేమ గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత తన షూటింగ్ మొదలైంది అన్నారు.

READ ALSO : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

Visitors Are Also Reading