Home » కొడాలి నాని వలన ఎన్టీఆర్, వి. వి వినాయక్ కాంబినేషన్లో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?

కొడాలి నాని వలన ఎన్టీఆర్, వి. వి వినాయక్ కాంబినేషన్లో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా..?

by Mounika
Ad

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు వి.వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఆది చిత్రం ఇద్దరి కెరియర్ లోను పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి గాను వి.వి వినాయక్ బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డును గెలుచుకున్నారు. నిర్మాతలకు సైతం ఆది చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో అదుర్స్2 వచ్చే అవకాశం ఉందని గతంలో పలు ప్రచారాలు జరగగా అది కేవలం మాటల వరకే పరిమితమైంది.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆది చిత్రంతో స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత వరుస చిత్రాలు చేస్తూ ఎన్టీఆర్ రేంజ్ పెరగడం వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ సినిమా కాకుండా ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఆగిపోయిందనే విషయం చాలామందికి తెలియదు. ఆది సినిమా కంటే ముందే ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కాల్సి ఉందట . మొదటిగా వినాయక్ ఓ లవ్ స్టోరీ రాసుకున్నానని, ఆ క్లాస్క్ లవ్ స్టోరీ గురించి జూనియర్ ఎన్టీఆర్ ను వినిపించడం జరిగిందట.

Advertisement

v v vinayak ntr

v v vinayak ntr

ఎన్టీఆర్ కు కూడా ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడట. 40 లక్షల బడ్జెట్ తో ఆ సినిమాని తెరకెక్కించాలనుకున్నారట వినాయక్. ఇక ఈ విషయమే కొడాలి నానితో ఎన్టీఆర్ చెప్పగా నాని వద్దని చెప్పడంతో.. ఆ విషయం వినాయక్ కి ఎలా చెప్పాలి అని ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడని , ఆ తర్వాత తారక్ ను మరో ఛాన్స్ అడిగి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆది చిత్రాన్ని తెరకెక్కించి మొదటి చిత్రంతోనే ఘనవిజయాన్ని అందుకొని డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టానని వినాయక్ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

వైర‌ల్ అవుతున్న ఎస్పీ బాలసుబ్రమ‌ణ్యం గారి ఫ్యామిలీ ఫోటోలు..మీరూ ఒక లుక్కేయండి..!

యుక్త వయసులోనే తల్లిని, భర్తను కోల్పోయినా సుప్రియ..! ఈమె జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది ..!

స్వేచ్ఛ అంటే ఇదేనా..? ఇలా ఓటీటీలో రెచ్చిపోతే.. నేటి తరం యువత నాశనానికి మీరే కారణం అవుతారు..!

Visitors Are Also Reading