Home » యుక్త వయసులోనే తల్లిని, భర్తను కోల్పోయినా సుప్రియ..! ఈమె జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది ..!

యుక్త వయసులోనే తల్లిని, భర్తను కోల్పోయినా సుప్రియ..! ఈమె జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుంది ..!

by Mounika
Ad

హీరోయిన్ సుప్రియ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా గుర్తుండకపోవచ్చు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా లో నటించిన హీరోయిన్ సుప్రియ అనగానే ఎవరైనా సరే వెంటనే గుర్తుపట్టేస్తారు. సుప్రియ అక్కినేని నాగేశ్వర రావు పెద్ద కూతురైనా యార్లగడ్డ సత్యవతి కూతురు. అంటే అక్కినేని నాగార్జునకు స్వయానా మేనకోడలు అవుతుంది. అంతేకాకుండా హీరో సుమంత్ కి స్వయానా సొంత అక్క అవుతుంది. ఈమె తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు టాలీవుడ్లో బడా నిర్మాతగా ఉండేవారు. సుప్రియ తల్లి ఆమె యుక్తవయసులోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతులు సుప్రియ, సుమంత్ బాధ్యతలను చేపట్టారు.

Supriya

Advertisement

1996లో విడుదలైన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా ఆమెను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేసి స్టార్ హీరోయిన్ ని చేయాలని అక్కినేని కుటుంబం భావించిందట. కానీ ఆ చిత్రంలోని సుప్రియ లుక్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మొదటి సినిమాతోనే ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదని తెలుగు ప్రేక్షకులు ఆమెను రిజెక్ట్ చేశారు.  ఆ తర్వాత ఆమె మరి ఏ సినిమాలోని నటించలేదు. ఆ తరువాత ఇష్టం చిత్రంలో హీరోగా నటించిన చరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Advertisement

ఇక హీరోయిన్గా రాణించలేని సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలు వ్యవహరించారు. ఆ సమయంలో సుప్రియ అన్నపూర్ణ స్టూడియోలో చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేవారని ఆమెపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా సుప్రియ అన్నపూర్ణ స్టూడియోలో పనిచేసే అధికారులపై..  షూటింగులు జరిపే దర్శక నిర్మాతలపై కూడా చాలా కఠినంగా వ్యవహరించేవారని, కొన్నిసార్లు ఆమె నిజాయితీ గల ప్రవర్తన భరించలేక చాలామంది అన్నపూర్ణ స్టూడియో వదిలి వెళ్ళిపోయి రామోజీ ఫిలిం సిటీలో సినిమా షూటింగులు జరుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట.

ఇక కొన్ని సంవత్సరాల తర్వాత భర్త చరణ్ ను కూడా కోల్పోయారు సుప్రియ. ఆ తర్వాత కూడా ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అన్నపూర్ణ స్టూడియోని మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలను సమర్థవంతంగా ఒంటి చేత్తో నడిపిస్తున్నారు. నాగార్జున కూడా ఎన్నో సందర్భాలలో సుప్రియ మాత్రమే అన్నపూర్ణ స్టూడియో ని సక్సెస్ఫుల్గా నడపగలదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ స్టూడియో కోసం ఎంతో శ్రమపడినా సుప్రియ ఒక సాధారణ ఉద్యోగిగా కేవలం జీతం మాత్రమే తీసుకుంటూ తన కూతురుని పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ విధంగా చిన్న వయసులోనే భర్తను, తల్లిని కోల్పోయినా సుప్రియ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వ్యాపార రంగంలో ముందుకు దూసుకుపోతూ నేటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరికొన్ని వార్తలు :

మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి అధికంగా గూగుల్ లో సెర్చ్ చేస్తున్న నెటిజన్స్..! వారు ఇంతకీ దేనికోసం వెతుకుతున్నారో తెలుసా..?

 

Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

Visitors Are Also Reading