వైకుంఠపురి ముచ్చింతల్‌లో మరొక మహా అద్భుతమైన ఆవిష్కృతం కాబోతుంది. 108 దివ్య దేశాల్లోని పెరుమాళ్లకు ఏకకాలంలో నిర్వహించబోయే శాంతి కళ్యాణం కోసం బంగారు ఆభరణాలు, బంగారు తల్లులకు మంగళసూత్రాలతో పాటు పెరుమాళ్ల ఆభరణాలు సిద్ధం చేశారు. సమతామూర్తి కేంద్రం ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమంలో మేలిమి బంగారంతో మెరుస్తున్న మంగళసూత్రాలను సిద్ధం చేసారు. 108 దివ్య దేశాలలో కొలువైన తాయర్లను అలంకరించబోనున్నాయి. సిరిలో కొలువు అయి ఉండే వాసలక్ష్మీ అమ్మవారు ధరించే మంగళసూత్రం ఇదే. శ్రీవిల్లి పుత్తూర్ రంగమన్నార్ ఆండాల్ ధరించబోయే బంగారు సూత్రం, శ్రీ వేంకటేశ్వరుని హృదయ నివాసి పద్మావతి అమ్మవారు ధరించబోయే మంగళ సూత్రాలు సిద్ధం చేసారు.
Also Read : IND Vs WI : మూడో టీ-20 మ్యాచ్‌కు కోహ్లీ, పంత్ దూరం
Advertisement
Advertisement
మంగళాభరణాలకు తాడు బదులుగా బంగారు సూత్రాన్నే చేయించారు. లోక రక్షణ కోసం జరిగే శాంతి కల్యాణాన్ని వీక్షించిన జన్మపునీతం. అమ్మవార్లకే కాదు అయ్యవార్లకు కూడా ఆభరణాలున్నాయి. ఆలయంలో ఉండే మూలమూర్తులతో పాటు పెరుమాళ్లకు కూడా సువర్ణాభరణాలు చేయించారు. సువర్ణ రామానుజుల వారికి యజ్ఞోపవేతంతో పాటు మూల మూర్తులందరికీ వెండి యజ్ఞోపవేతాన్ని తయారు చేయించారు. శ్రీమత్బాగవద్రామానుజులు భవ్య విగ్రహ ఎదురుగా ఉన్న ధ్వజస్థంబాన్ని పోలిన సువర్ణమయ ధ్వజ స్థంబాన్ని ఏర్పాటు చేసారు.
రాబోయే తరాల వారు దీనిని పునః ప్రతిష్ట చేయడానికి మార్గదర్శకంగా తోడ్పడేవిధంగా ధ్వజస్థంభం రూపొందించారు. పునః నిర్మాణ సమయంలో ఎవరు ప్రతిష్టించారని శాసనాలతో సహ నిక్షిప్తం చేశారు. పూర్తిగా సువర్ణమయమైన ధ్వజస్తంభం సర్వదేవతలకు ఆహ్వానం పలుకుతుంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి మంగళాశాసనాలతో తిరువాభరణాలు సహస్రాబ్దికమిటీ రూపొందించింది. మహక్రతువు, చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమంలో పాల్గొని పెరుమాళ్ల సేవలో తరించడం భక్తులు పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నారు.
Also Read : అరబిక్ కుత్తు పాటపై ట్రోల్స్…ఏంటి అనిరుథ్ కూడా లేపేశాడా..?