Home » అర‌బిక్ కుత్తు పాట‌పై ట్రోల్స్…ఏంటి అనిరుథ్ కూడా లేపేశాడా..?

అర‌బిక్ కుత్తు పాట‌పై ట్రోల్స్…ఏంటి అనిరుథ్ కూడా లేపేశాడా..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు సంగీత ద‌ర్శ‌కులు మ్యూజిక్ అందించిన పాట భాగుందంటే ప్ర‌శంస‌లు కురిపించేవారు. కానీ ఇప్పుడు ఓ పాట వ‌చ్చిందంటే దాన్ని ఎక్క‌డ నుండి లేపేశారు. ఏ పాట‌ను పోలి ఉంద‌ని వెతుకున్నారు. నిజానికి సంగీత ద‌ర్శ‌కులు కాపీ కొడుతున్నారో లేదో గానీ పాట‌లో చిన్న బిట్ ఉన్నా ట్రోల‌ర్స్ ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో అలా ఎక్కువగా త‌మన్ పాట‌ల‌పై ట్రోల్స్ వ‌స్తుంటాయి. త‌మ‌న్ పాట‌ల‌పై ట్రోల్స్ కొత్తేమీ కాదు. మొద‌టి నండే ఉన్నాయి. ఇక దేవీ శ్రీ పాట‌ల‌పై కూడా అప్పుడప్పుడు ట్రోల్స్ వ‌స్తున్నాయి.

ALSO READ : వేణు మాద‌వ్ సినిమాలతో ఎంత‌ సంపాదించారు..?ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది..!

Advertisement

ఇక ఇప్పుడు మ‌న‌వాళ్లు త‌మిళ పాట‌ను ప‌ట్టుకుని కూడా ట్రోల్స్ మొద‌లు పెట్టారు. అంతే కాకుండా యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు సంపాదించుకున్న అనిరుద్ పాట‌పై ట్రోల్స్ చేస్తున్నారు. అనిరుద్ ఎన్నో పాట‌ల ద్వారా సంగీత ప్ర‌పంచంలో ఎదిగాడు. చిన్న వ‌య‌సులోనే కొల‌వ‌రి డి పాట‌తో ఊపు ఊపేశాడు. అంతే కాకుండా త‌ర‌వాత చాలా పాటకు మ్యూజిక్ ఇచ్చి సూప‌ర్ హిట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా పేరు సంపాదించుకున్నాడు.

Advertisement

ప్ర‌స్తుతం ప‌లువురు స్టార్ హీరోల సినిమాల‌కు స్వ‌రాలు స‌మ‌కూరుస్తు బిజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా మారిపోయాడు. ఇక అనిరుద్ తాజాగా విజ‌య్ హీరోగా న‌టించిన బీస్ట్ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలోని అర‌బిక్ కుత్తు అనే పాట‌ను రీసెంట్ గా విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

అయితే ఈ పాటలోని బీట్ మరియు ఓ బాలీవుడ్ పాట బీట్ ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. దాంతో ఈ ఆ పాట‌ను అర‌బిక్ కుత్తు పాట‌ను వీడియో చేసి నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఏంటి అనిరుద్ నువ్వు కూడానా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే అర‌బిక్ కుత్తు పాట‌కు ఇప్ప‌టికే 40మిలియ‌న్స్ కు పైగా వ్యూవ్స్ వ‌చ్చాయి.

Visitors Are Also Reading