Home » సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

సమంత చికిత్స కోసం స్టార్ హీరో 25 కోట్ల ఆర్థిక సహాయం… క్లారిటీ ఇదే !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. గత ఏడాదికాలంగా సమంత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో బాధపడుతోంది. అయినప్పటికీ గత ఏడాదికాలంగా తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసింది సమంత. ఇక ఇప్పుడు అన్ని సినిమాలకు బ్రేక్ ఇచ్చి… ఇండోనేషియా దేశంలో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. అయితే ఇలాంటి తరుణంలోనే హీరోయిన్ సమంత గురించి ఓ ఆసక్తికర విషయం గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

సమంత చికిత్స కోసం చాలా ఖర్చు అవుతుందని… దాంతో అప్పు కూడా చేసిందని కొంతమంది ప్రచారం చేశారు. ఈ మయోసైటిస్ కోసం ఏకంగా ఓ స్టార్ హీరో దగ్గర 25 కోట్ల రూపాయలు సమంత అప్పు చేసిందని గత వారం రోజుల నుంచి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే నిజమని అందరూ నమ్మరు కూడా. అయితే ఈ విషయంపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

Advertisement

మయోసైటిస్ చికిత్స కోసం హీరోయిన్ సమంత ఓ స్టార్ హీరో నుంచి 25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందుకుందని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా ఈ విషయంపై సమంత స్పందించింది. మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్ల రూపాయలా ? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారని సమంత పేర్కొంది. ఈ మొత్తంలో అతి చిన్న భాగం మాత్రమే ఖర్చు అయింది… నేను జీతం తీసుకున్నాను కాబట్టి నేను సులభంగా నన్ను చూసుకోగలరు అని వెల్లడించింది సమంత. నేనొక్కదాన్నే కాకుండా మయోసైటిస్ వ్యాధి కారణంగా వేలాదిమంది బాధపడుతున్నారని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది సమంత.

ఇవి కూడా చదవండి

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

 

Visitors Are Also Reading