Home » ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

ఆ హీరోకు లవర్ గా, సిస్టర్ గా నటించిన తమన్నా…!

by Bunty
Ad

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా సినిమాలలో నటిస్తోంది. ఇతర భాషల్లోనే కాకుండా బాలివుడ్ లో వెబ్ సిరీస్ లలో బోల్డ్ సీన్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక మిల్కీ బ్యూటీ తమన్న బోల్డ్ సీన్లు చేయడంతో హాట్ టాపిక్ గా నిలిచింది.

Advertisement

ఇక ఈ మధ్యకాలంలో వచ్చిన ‘జైలర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించి ఫేమస్ అయిపోయింది. ‘బోళా శంకర్’ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా నటించనుంది. ఇదిలా ఉండగా… తమన్నా ఒకానొక సమయంలో ఒక హీరో సరసన హీరోయిన్గా నటించి… ఈ మధ్యకాలంలో అదే హీరోకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ హీరో మరెవరో కాదు సుశాంత్. గతంలో ‘కాళిదాసు’ సినిమాలో సుశాంత్ సరసన హీరోయిన్ గా నటించింది.

Advertisement

ఇక ఇప్పుడు ‘బోళా శంకర్’ సినిమాలో హీరో సుశాంత్ కు తమన్నా చెల్లెలి పాత్రలో నటించనుంది. ఒకానొక సమయంలో ఆ హీరో పక్కన హీరోయిన్గా చేసి ఇప్పుడు చెల్లెలుగా నటించడం ఏంటి అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇక సినిమాలో ఇలాంటివన్నీ కామన్ అని మరికొంతమంది బదులిస్తున్నారు. ఇక ‘బోళా శంకర్’ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవికి ఏ మేరకు హిట్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ దశాబ్ద కాలంలో తెలంగాణ స్లాంగ్ లో అదరగొట్టిన సినిమాలు…!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

Visitors Are Also Reading