Home » ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ డైరెక్టర్.. ఆహాలో అద్భుతమైన కామెడీ షో

ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ డైరెక్టర్.. ఆహాలో అద్భుతమైన కామెడీ షో

by Anji
Ad

తెలుగు సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు అన్ లిమిటెడ్ వినోదాన్ని అందిస్తూ ‘ఆహా’ డిజిటల్ రంగంలో దూసుకుపోతుంది. టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలనే కాకుండా ఇతర భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలను కూడా డబ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే గేమ్ షోస్, టాక్ షోస్, కుకింగ్ షోస్ అంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ప్రస్తుతం అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోతో యాంకర్ గా నందమూరి బాలకృష్ణ లోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘ఆహా’ ఇప్పుడు సరికొత్త షోను లాంచ్ చేస్తుంది. కామెడీ స్టాక్ ఎక్సెంజ్ పేరుతో మరో షోను స్టార్ట్ చేస్తుంది.


అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్ తో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. వరుస విజయాలతో ఇండస్ట్రీలో అపజయమేరుగని దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పుడు కామెడీ స్టాప్ ఎక్సెంజ్ షోకు న్యాయ నిర్ణీతగా వ్యవహరించబోతున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఈ కామెడీ షో నవంబర్ నుంచి ప్రారంభం కాబోతుందని ‘ఆహా’ ప్రకటించింది. ఈ షోను ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోంది. స్టేజీల మీద కామెడీ చేసి ప్రేక్షకులను తమవైన మాటలతో కడుపుబ్బ నవ్వించే వారికి ఇది పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ షోతోనే సుడిగాలి సుదీర్ ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారు. అలాగే వేణు, ముక్కు అవినాష్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ వంటి వాళ్లు ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Advertisement

Advertisement

Also Read :   ఒకే ప్రేమ్‌లో మ‌హేష్ బాబు కుమారుడు గౌత‌మ్ కృష్ణ‌, కూతురు సితార‌..!

”ప్రతిభవంతులైన నటులతో కామెడీ స్టాక్ ఎక్సేంజ్ కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆధ్యంతం నవ్వించే ఈ షోకు నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. నా ఓటీటీ డబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను. అతి త్వరలోనే ఆహాలో రాబోతున్న కామెడీ స్టాక్ ఎక్సేంజ్ చూసి కడుపుబ్బా నవ్వేందుకు సిద్ధంగా ఉండండి” అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Also Read :  రాజమౌళి- మహేష్ సినిమాలో ఆ సీన్ సినిమాకి హైలెట్ అట..!

Visitors Are Also Reading