Home » బిగ్ బాస్ లోకి స్టార్ క్రికెటర్ ఎంట్రీ..?

బిగ్ బాస్ లోకి స్టార్ క్రికెటర్ ఎంట్రీ..?

by Anji
Ad

బిగ్ బాస్ రియాలిటీ షోలో టీమిండియా స్టార్ క్రికెటర్. అవును మీరు విన్నది నిజమే. గతంలో హిందీ సీజన్ లో శ్రీకాంత్ పాల్గొని రన్నరప్ గా నిలిచాడు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ దక్షిణాది బిగ్ బాస్ రియాలిటీ షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇంతకీ ఎవరీ ఆటగాడు? ఏంటి సంగతి? బిగ్ బాస్ షోలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పాల్గొంటారు. కుదిరితే గెలుస్తారు. లేదంటే మధ్యలో ఎలిమినేట్ అయిపోతారు. ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న ఏడో సీజన్ లో మాత్రం దాదాపుగా అందరూ నటులే వచ్చారు. కానీ అక్టోబర్ 8 నుంచి మొదలయ్యే కన్నడ సీజన్ లో మాత్రం భారత మాజీ బౌలర్ వినయ్ కుమార్ ఎంట్రీ ఇవ్వనున్నాడట.

Advertisement


వినయ్ కుమార్.. టీమిండియా తరఫున 31వన్డేలు, 9 టీ 20 లు, ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఓవరాల్ గా 48 వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో కోల్ కతా, ముంబై, బెంగళూరు జట్లకు ఆడాడు. చివరగా 2013లో భారతీయ జట్టుకు ఆడారు. 2021 లో మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. మరి ఇది నిజమా కాదా? ఒకవేళ హౌస్ లోకి వస్తే ఏం చేస్తాడనేది చూడాలి?

Advertisement

తెలుగు సీజన్ లో ప్రస్తుతం నాలుగో వారం నడుస్తోంది. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేట్ అయిపోయారు. మిగతా 11 మందిలో ఈవారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వాళ్లలో రతిక, టేస్టీ తేజ్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే నాలుగో పవరస్త్ర కోసం యవర్, ప్రశాంత్, శుభశ్రీ పోటీలో ఉన్నారు. వీళ్ళలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు? పవరస్త్ర గెలుచుకునేది ఎవరో చూడాలి?

Visitors Are Also Reading