Home » టీడీపీ నుండి అలీ అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు..శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.!

టీడీపీ నుండి అలీ అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చేశారు..శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.!

by AJAY
Ad

టాలీవుడ్ క‌మెడియ‌న్ అలీ వైసీపీలో కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలీ గ‌త ఎన్నిక‌ల‌లో వైసీపీ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. అంతే కాకుండా అలీ గుంటూరు నుండి టికెట్ ఆశిస్తున్నారంటూ కూడా వార్త‌లు వినిపించాయి. మ‌రోవైపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామ‌ని చెప్పినా అలీ తిరస్క‌రించార‌ని కూడా వార్తలు వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా అలీని వైసీపీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు పంప‌బోతున్నారంటూ కూడా రీసెంట్ గా వార్త‌లు వినిపించాయి.

ALSO READ : ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాకి చిరంజీవికిచ్చిన రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Advertisement

మ‌ళ్లీ రాజ్య‌స‌భ కాద‌ని అలీని ఏపీ వ‌క్ఫ్ బోర్డ్ చైర్మెన్ గా నియ‌మిస్తున్నారని దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రావాల్సి ఉంద‌ని కూడా ఇప్పుడు క‌థనాలు వ‌స్తున్నాయి. దాదాపు వ‌క్ఫ్ బోర్డు చైర్మెన్ గా అలీని ఎంపిక చేయ‌డం ఖ‌రారు అయినట్టు టాక్. ఇదిలా ఉండగా తాజాగా అలీపై టాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి ఓ వీడియో చేసింది. వీడియోలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది.

Advertisement

అలీ ఎంతో ప్ర‌జాసేవ చేశార‌ని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. త‌న తండ్రి పేరుతో అలీ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసి ఎంతో మంది పేద‌వారికి సాయం చేశార‌ని తెలిపింది. దాదాపు ప‌ద‌కొండువంద‌ల సినిమాల్లో న‌టించి ఎంతో న‌వ్వించార‌ని తెలిపింది. అంతే కాకుండా నంది అవార్డును రెండు సార్లు ద‌క్కించుకున్నార‌ని….మ‌రికొన్ని అవార్డులు కూడా వ‌చ్చాయ‌ని తెలిపింది. అయితే ఈ వీడియోలో అలీ టీడీపీ నుండి బ‌య‌ట‌కు ఎందుకు వ‌చ్చారో కూడా తెలిపింది.

టీడీపీలో అలీకి స‌రైన గౌర‌వం ద‌క్క‌లేద‌ని ఎంతో క‌ష్ట‌ప‌డినా గుర్తించ‌లేద‌ని చెప్పింది. మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ప్పుడు ఇంట్లో వాళ్లు మ‌న క‌ష్టాన్ని గుర్తించిక‌పోతేనే బాధ ఉంటుంద‌ని అలాంటిది ఎంతో కాలం టీడీపీ కోసం ప‌నిచేసినా అలీకి గుర్తింపు దక్క‌లేద‌ని అన్నారు. దాంతో ఆయ‌న టీడీపీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని చెప్పింది. ఇక సీఎం జ‌గ‌న్ పాద‌యాత్ర చేయ‌డం..ఆయ‌న‌కు ప్ర‌జ‌లపై ఉన్న ప్రేమ చూసి అలీ వైసీపీలో చేరార‌ని చెప్పింది. ఖ‌చ్చితంగా అలీకి మంచి పద‌విని త్వ‌ర‌లోనే ఇవ్వ‌బోతున్నార‌ని చెప్పింది.

Visitors Are Also Reading