Home » ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాకి చిరంజీవికిచ్చిన రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాకి చిరంజీవికిచ్చిన రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

by Azhar
Ad

1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రాన్ని సి. అశ్వనీదత్ నిర్మించారు. 1990 మే 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

Advertisement

Advertisement

ఈ సినిమాలో న‌టించింనందుకు గాను చిరంజీవికి 35 లక్షల పారితోషికం ఇచ్చార‌ట‌, ఇక చిరుకు జంట‌గా న‌టించింన శ్రీదేవికి 25 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. ఈ సినిమాకు పెట్టిన ఖ‌ర్చుల‌న్నీ పోనూ నిర్మాత‌కు 35 ల‌క్ష‌లు మిగిలాయ‌ట‌! ఈ విష‌యాన్ని ఈ చిత్ర నిర్మాత అశ్వ‌నీద‌త్ యే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అప్ప‌ట్లో 15 ల‌క్ష‌లు మిగిలితేనే సినిమా సూప‌ర్ హిట్., ఆ లెక్క‌న చూస్తే జగదేకవీరుడు అతిలోక సుందరి బంప‌ర్ హిట్ అన్న‌ట్టే!

అప్ప‌ట్లో బాల్క‌నీ టికెట్ ధ‌ర 6 రూపాయ‌లు మాత్ర‌మే! అయిన‌ప్ప‌టికీ ఈ సినిమా 7 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా నిర్మాణానికి 9 కోట్లు దాకా పెట్టాడ‌ట అశ్వ‌నీద‌త్… సినిమా మీద న‌మ్మ‌కంతో త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బునంతా పెట్టేశాడ‌ట‌!

Visitors Are Also Reading