Home » శ్రీలీల-వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? 

శ్రీలీల-వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? 

by Anji
Ad

మెగా హీరోలలో వైష్ణవ్ తేజ్ ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మొదటి సినిమా అయిన ఉప్పెనతో ప్రేక్షకుల ముందుకు వచ్చి శభాష్ అనిపించుకున్నాడు. బుచ్చిబాబు సానా ఉప్పెన మూవీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు దర్శకుడు బుచ్చిబాబు. దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసింది ఉప్పెన. వైష్ణవ్ తేజ్ ఉప్పెన తరువాత ఆ రేంజ్ హిట్ ని మళ్లీ అందుకోలేకపోయాడు. 

Advertisement

 

 

ఇటీవలే రంగరంగ వైభవంగా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ ఆ సినిమా పాజిటివ్ టాక్ రాకపోవడంతో ఈ చిత్రం అంతగా హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఈ మెగా హీరో కెరీర్ డైలామాలో పడింది. వరుస ప్లాఫ్ లతో ఈయన మార్కెట్ లో భారీగా డౌన్ అయింది. ప్రస్తుతం తన 4వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆదికేశవ అనే టైటిల్ ని ఈ చిత్రానికి ప్రకటించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగవంశీ నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా ధమాకా బ్యూటీ శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన లభిస్తోంది. అందులో శ్రీలీల హీరోయిన్ కావడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. తాజాగా ఈ చిత్రానికి కొత్తగా విడుదల తేదీని మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించేశారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చేశారట. ఇప్పటికే ఆగస్టులో మెగా హీరోలు ఇద్దరూ రాబోతున్నారు. చిరంజీవి భోళా శంకర్ ఆగస్టు 11న విడుదలవుతుంటే.. వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ఆగస్టు 25న విడుదల కాబోతుంది. చిరంజీవి, వరుణ్ తేజ్ మధ్యలో ఆదికేశవ మూవీతో వైష్ణవ్ తేజ్ రాబోతున్నాడు.  ఈయన కెరీర్ కి ఈ మూవీ ప్లస్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

తీన్మార్ న్యూస్ యాంకర్ శివజ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 Kailasa PM Ranjitha : నిత్యానంద రాజ్యానికి ప్రధానిగా నటి రంజిత!

స్టార్ హీరో కొడుకు వేధించాడంటూ వార్తలు.. స్పందించిన కృతి శెట్టి

Visitors Are Also Reading